30.7 C
Hyderabad
May 5, 2024 05: 26 AM
Slider కవి ప్రపంచం

ధర్మ ఛత్రం

#dr.srija

సంకల్పాన్ని గుర్తుచేసే

సంస్కృతుల పాదుగా

పురాణాలకు పుట్టినిల్లుగా

భగవానుడు నడియాడిన పుణ్యభూమే హిందుత్వం

జాతి గౌరవం పెంచేది

దేశ ధర్మం పంచేది

విలువల్ని చెప్పేది

అనంత విశ్వంలో అఖండ చరిత్ర

పుణ్య పురుషుల్ని గనినట్టి విశ్వాదాత్రి

శాస్త్రాల సంపద

ఉపనిషత్తులు గీతా జననీ

శైవ వైష్ణ జైన బౌద్ధ ధర్మాల ఉదయం

శ్రీకృష్ణుని స్థానము శ్రీరాముని క్షేత్రము

సప్తగిరులు సప్త సముద్రాలు సప్తపదులు

సప్త వర్ణాల భారతీయత

ఓంకారపు నాదము గాయత్రీ మంత్రము కామధేనువు కల్పతరువు చరిత్ర పుటల సాక్షిగా వాస్తవాల తర్కము

తాత్వికతకు సజీవ సాక్ష్యం

పవిత్ర పరమధామము

విశ్వప్రేమకు సూత్రము హిందుత్వం

అక్రమ నిర్మాణాలపై నిగ్గదీసి అడుగు

హక్కుగా ఎదురించు

హిందూ ఐక్యతతో సాధించు

అయోధ్య మందిర్ అయిన జ్ఞానవాపియైన మరి ఇంకేదైనా

తుది శ్వాస వరకు పోరాడు ఐక్యమత్యమే బలం

హిందూత్వం అంటే

ఎన్నటికీ తరగనిది ఎప్పటికీ వాస్తవమైనది జీవన విధానం

హిందుత్వం అంటే ఆది

హిందుత్వం సనాతనం

హిందుత్వపు నిత్య నూతనం

ధర్మ చత్రంలో సంప్రదాయ వారసత్వమై

హిందుత్వమే మన

బంధుత్వంగా నరనరానా జీర్ణించుకుంది.

డా. శ్రీజ. పి, ఖమ్మం

Related posts

ఇంకా కొనసాగుతూనే ఉన్న రోడ్డు విస్తరణ వివాదం

Satyam NEWS

వందేళ్ల చరిత్ర ఉన్న సంగీత కళాశాలలో సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాదనోత్సవం

Satyam NEWS

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

Satyam NEWS

Leave a Comment