38.2 C
Hyderabad
April 28, 2024 21: 48 PM
Slider అనంతపురం

ఇంకా కొనసాగుతూనే ఉన్న రోడ్డు విస్తరణ వివాదం

#ananthapur

అనంతపురం పట్టణం లో రోడ్డు విస్తరణ వివాదం కొనసాగుతూనే ఉన్నది. రోడ్డు విస్తరణ కోసం తాము స్థలం ఇచ్చి సర్వస్వం కోల్పోయామని షాపులు కోల్పోయిన 27 మంది వాపోతున్నారు. తమ స్థలాలు ఇచ్చి తాము రోడ్డున పడితే ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఒక కాంట్రాక్టర్ కు ప్రభుత్వం కేటాయించిందని దళిత గిరిజనులు కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

అయితే కాంట్రాక్టర్ జయరామిరెడ్డి కి 11 సెంట్ల ప్రభుత్వం స్థలాన్ని ఇంకా కేటాయించలేదని ఆర్డీఓ నిశాంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కేవలం మున్సిపాలిటీ, ఆర్అండ్ బి అధికారులు తీర్మానం చేసి మాత్రమే పంపారని చెబుతూ సంబంధిత కాపీ లను ఆయన చూపించారు. ఈ విషయం పై ఉన్నత అధికారులు కూడా పరిశీలిస్తున్నారని ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కేటాయించినట్లు ఇవ్వలేదని అయన తెలిపారు. పట్టణం లో షాప్ లు కోల్పోయిన 27 మందికి ఒకే సారి న్యాయం జరిగేలా చూడాలని దళిత గిరిజన, సిపిఐ, సిపిఎం నేతలు అధికారికి విన్నవించారు.

Related posts

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

Satyam NEWS

కేసీఆర్ నామస్మరణ జపం కోసమే ఆరాటం

Satyam NEWS

వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

Satyam NEWS

Leave a Comment