33.2 C
Hyderabad
May 15, 2024 14: 48 PM
కవి ప్రపంచం

పురాతన ధర్మం

#nannapurajuvijayashree

నా దేశం చరిత్రకందని పురాతన ధర్మం

ధర్మో రక్షతి రక్షితః అని ప్రబోధించే నా ధర్మం

కాలప్రవాహంలో కాలాగ్ని నేత్ర 0 నా హిందుత్వం

ఆటుపోటులు తట్టుకునే అమరసమర కురుక్షేత్రం నాదేశం

నిలకడగా నిలబడే దానగుణం ఉన్న కౌంతేయుని ధర్మ పదం

మానవుని కర్తవ్యాన్ని బోధించే గీతోపదేశం నా దేశం

గౌతముని జ్ఞాన బోధ ఆదిశంకరుని ఆధ్యాత్మిక ఉపదేశం నాదేశం

హిందూ మతాన్ని చాటి చెప్పిన అక్బర్

పురుషోత్తముని హిందూమత ప్రేమ అ దేశభక్తికి నిదర్శనం

అలెగ్జాండర్ ను ఎదిరించే సాహసం నా దేశ వీరుల దే వీరత్వం అది వారి జవసత్వం

వాల్మీకి రామాయణం కాళిదాసు కావ్యాలు

కవిత్రయం భారతం పోతన భాగవతం హిందుత్వం

నిరంతర ప్రవాహంలాకలకాలం సాగుతూనే ఉంది

ప్రబంధాలలో ప్రజ్వలిస్తుంది. ప్రతి ధ్వనిస్తుంది.

వివేకానందుని విశ్వ ప్రసంగం ప్రపంచాన్ని నివ్వేరపరిచింది

విశ్వ కవి గీతాలు రోజు మన చెవులలోమారు మ్రోగుతున్నాయి

మన దేవాలయాలు కట్టడాలు పునరుద్ధరించు కోవాలి

హిందుత్వం ఒక సనాతన ధర్మం అని చాటి చెప్పాలి

ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని కాపాడుకోవాలి ఆ బాధ్యత మన అందరిదని చాటి చెప్పాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, డా. నన్నపురాజు విజయ శ్రీ, రంగారెడ్డి జిల్లా, 9100439884

Related posts

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

బిహైండ్ ది క్లౌడ్స్ (Behind the clouds)

Satyam NEWS

భాగ్యనగర భాగ్యశోభ

Satyam NEWS

Leave a Comment