34.7 C
Hyderabad
May 5, 2024 00: 30 AM
Slider కవి ప్రపంచం

బిహైండ్ ది క్లౌడ్స్ (Behind the clouds)

#jayanti Vasarachetla

ఆకాశ గుమ్మానికి ……,

బూడిదరంగు కర్టెన్ ఒకటి

నేలకు వేలాడుతుంది..!!

మధ్యమధ్యలో ఏదో యుద్దతంత్రం చేస్తున్నట్లు

ఒక మెరుపు కత్తిని విసురుతుంది..!!

యుద్దభేరి మ్రోగుతున్నట్లు ……

భృకుటి ముడివేసి రౌద్ర రూపాన్ని ప్రదర్శిస్తుంది…..

అప్పుడు….

నింగిజల్లెడలోంచి జారుతున్న వెండి చినుకులు

వెన్నెల వాకిట్లో పరుచుకుంటాయి…!

ఆ తథాగతుడి కి మేలిముసుగు తొడిగి

కాసేపు నిదురపొమ్మని …..

కాసిన్ని మంచు ముద్దలు విసిరి

కోపాన్ని చల్లార్చజూస్తాయి….!!

కత్తిరించబడిన కర్టెన్ ముక్కలు

పత్తి ఉండల్లా చుట్టుకుని

మట్టిదిబ్బకు తాకి దుమ్ముకొట్టుకుపోతాయి..!!

అప్పుడే…

సూర్యుడిని తెల్లబల్లపై నుండి

తుడిచివేయడానికన్నట్లు

మందపాటి మబ్బు దుప్పటి

నింగి సరిహద్దులు పరుచుకుంటుంది…!!

పరుచుకున్న మబ్బు తునకలు

పర్వతాల్లా వేలాడుతుంటాయి…!

ఆ ఆటలేవీ సాగనీయక

తన కిరణాల ఉధృతి పెంచి

దుమ్ము కొట్టుకున్న నింగినంతా ప్రభాకరుడు

విహాంగవీక్షణం చేసి వెలిగిస్తాడు.

ఏమబ్బులవెనుక ఏమున్నా …

తేటతెల్లం అవుతుందప్పుడు…!!

యంతి వాసరచెట్ల, హైదరాబాద్, 9985525355

Related posts

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

ఇంటి నిర్మాణాలకు ఐదులక్షలు ఇవ్వాలి

Sub Editor 2

మన్యం వీరుడు అల్లూరి జయంతి….రహదారిపై తిరుగాడిన జాతీయ పతాకం…!

Satyam NEWS

Leave a Comment