38.2 C
Hyderabad
April 29, 2024 12: 02 PM
Slider తూర్పుగోదావరి

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

#rivergodavari

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పరిధిలోగల ముంపు గ్రామ ప్రాంతాలు అయినా కుండలేశ్వరం, పల్లిపాలెం, పల్లంకురు రేవు, బూలవారిమొండె వద్ద వరద ఉధృతి మెల్లమెల్లగా రెండు అడుగుల మేర తగ్గు మొహం పట్టడంతో  గత కొద్ది రోజుల నుంచి విశ్రాంతి లేకుండా రాత్రి పగలు నిర్విరామంగా శ్రమిస్తున్న ఇరిగేషన్ ఏ.ఈ శివరామకృష్ణ మరియు సిబ్బంది లస్కర్లు 13 మంది ఎంపీడీవో కె సి హెచ్ అప్పారావు, మండల తాసిల్దార్ బి. మృత్యుంజయరావు, రెవెన్యూ అధికార సిబ్బంది మరియు పంచాయితీ అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ మండల పోలీస్ వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ౠల వారి మొండి వద్ద వరద ఉధృతి రోజురోజుకు పెరగడంతో అటు అధికారులు ఇటు పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనతో భయం భయంగా గడిపిన వారంతా వరద ఉధృతి రెండు అడుగులు తగ్గడంతో ప్రజల ముఖాలలో చిరునవ్వు వెళ్లి విరిసింది ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలైన సహాయక శిబిరాల కేంద్రాల వద్దకు తరలించిన  పల్లిపాలెం, పల్లంకురేవు ముంపు బాధితుల సహాయార్థం నిత్యవసర సరుకులు, బియ్యం (25) కేజీలు, పామాయిల్ ప్యాకెట్, పాలు, కొవ్వొత్తులు ఐదు (5) కాయగూరలు (ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంప) గ్రామ విఆర్వోలు పంపిణీ చేశారు

పల్లి పాలెం గ్రామస్తులకు 180 కార్డులు గల కుటుంబాలు 600 మందికి పునరావాస కేంద్రాల వద్ద ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ,సాయంత్రం భోజనాలు ఏర్పాటు జరుగుతుందని ముంపు బాధిత ప్రజలకు వైద్య సదుపాయాలు పరిసర ప్రాంతాలలో, శానిటైజేషన్ చేస్తున్నట్లు వి.ఆర్ ఓ ఏసు రత్నం తెలిపారు

అలాగే  పల్లంకురు పంచాయతీ పరిధి అయినా పల్లంకురు రేవు వద్ద ముంపు బాధితుల సహాయార్థం 81 కార్డు గల కుటుంబాలకు నిత్యవసర సరుకులు, పామాయిల్, కాయగూరలు, ఐదు కొవ్వొత్తులు, పాలు, పంపిణీ చేశారు ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, మంచినీళ్లు, ముంపు బాధిత ప్రజలకు వైద్య సదుపాయం పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నట్లు వీఆర్వోలు ,ఆర్ ఐ ,తెలియజేశారు

అలాగే కాట్రేనికోన మండల పోలీస్ ఎస్ఐ.జబ్బీర్ మరియు సిబ్బంది, మహిళా పోలీసులు రాత్రి పగలు నిద్రాహారాలు  పట్టించుకోకుండా బూలవారి మొండి వద్ద ఏటుగట్టుపై మోహరించి వరద ఉధృతిని పరిశీలించడానికి, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగ అధికారులు,చూడడానికి ఆయా గ్రామాల నుంచి వస్తున్న జనాలను అదుపు చేయటంలో ఎంతో నేర్పు కనబరిచారు.

Related posts

సుగంధ ద్రవ్యాలతో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Satyam NEWS

రియల్ విజన్ ఇన్ఫ్రా కార్పొరేట్ కార్యాలయం ఆరంభం

Satyam NEWS

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి ఉద్వాసన

Satyam NEWS

Leave a Comment