38.2 C
Hyderabad
May 5, 2024 22: 41 PM
Slider కవి ప్రపంచం

హిందువంటే..

#NutenkiRavindar22

కమలం పువ్వో
ఖాకీ నెక్కరో కాదు
భజరంగ దళాలో
ఫలానా పరిషత్తులో కానే కాదు
మఠాలో.. పీఠాలో…
వాటి అధిపతులో అంతకన్నా కాదు
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వగైరా వగైరా…
కాదు కాదు కాదు

హిందువంటే..
చెట్టూ పుట్టను పూజించేటోడు
మట్టినీ మనిషినీ ప్రేమించేటోడు
సూర్యచంద్రులూ నక్షత్రాలకు నమస్కరించేటోడు
గ్రామదేవతలకు యాటల్ని బలిచ్చేటోడు
ముక్కోటి దేవుళ్ళకు ముడుపులు చెల్లించేటోడు
కట్టూ బొట్టూ పాటించేటోడు
బోనమెత్తేటోడు జాతర్లు చేసేటోడు

ఈశుని పక్కనే యేసుని
గుండెల్లో పెట్టుకొని మొక్కేటోడు
పీర్లగుండంల అస్సైదూలా లాడేటోడు
అవతలోడెవడైనా అలాయ్ బలాయ్ ఇచ్చేటోడు

ఇతర మతస్థుడిని కాఫిర్ అననివాడు
పరాయి దేవుణ్ణి సైతాన్లా చూడనివాడు

కులం రొచ్చులో పొర్లుడే తప్ప
పరమతాలకు ఉచ్చులు పన్ననివాడు

సింధూ లోయలో బయల్పడ్డ నాగరికతా శకలం వాడు
హిందూ మహాసముద్ర మంతటి ధీరోదాత్తుడు

వసుధైక కుటుంబకాన్ని కోరుకొనే విశ్వనరుడు వాడు
“లోకాస్సమస్తా సుఖినో భవంత”ని
దీవించే విశ్వగురువు వాడు

వాడు హిందువు
దయా సింధువు!

                                                                  నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట.

Related posts

ఫాలో అప్: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

పార్కింగ్ తో కూడిన సోలార్ షెడ్ ను ప్రారంభo

Bhavani

అసెంబ్లీ నుంచి చంద్రబాబునాయుడి సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment