37.2 C
Hyderabad
April 26, 2024 19: 24 PM
Slider కరీంనగర్

ఫాలో అప్: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

#Kamalasan Reddy

నేరాల పరిశోధనలో జగిత్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా ఇంచార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలని, వివిధ రకాల  నేరాలకు పాల్పడిన, ప్రమేయం ఉండి తప్పించుకుని తిరుగుతున్న వారు ఎక్కడున్నా పట్టుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి

దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై  ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎలాంటి క్రిమినల్ కేసులలో లేకుండా ఎక్కువ కాలం రౌడీషీట్లు ఉన్నవారి జాబితాను తయారు చేయాలని సూచించారు. రోడ్డు  ప్రమాదలను తగ్గిచేందుకు తగిన చర్యలను తీసుకోవాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై బ్యారికేడ్స్ పెట్టాలన్నారు. వేగంగా వాహనాలు నుడుపు వారి పై,ర్యాస్ డ్రైవింగ్ చేసే వారి పై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి, డీఎస్పీ లు వెంకటరమణ, ప్రతాప్, ఎస్ బి ఇన్స్పెక్టర్ సుధాకర్ రిజర్వు ఇన్స్పెక్టర్లు  పాల్గొన్నారు.

Related posts

మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందజేసిన ఎస్పీ

Murali Krishna

రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా

Satyam NEWS

ప్రపంచ విప్లవ మార్గదర్శి లెనిన్‌

Satyam NEWS

Leave a Comment