32.2 C
Hyderabad
May 13, 2024 19: 43 PM
Slider కవి ప్రపంచం

నీకై వేచితినోయి…

#arunachamarthy

నిన్ను చూసే క్షణం కోసం ఇంద్రుడి లా సహస్రాక్షినవ్వనా

నిలువెల్ల కనులే చేసుకొని నీ రాక కోసం

చూడనా వాన చినుకుకై వేచే చకోరంలా

దారంతా పరిమళాల పారిజాతాలు పరువనా

తైల సంస్కారం లేని కురులు నీకై నిక్కి నిక్కి చూస్తున్నాయి

నీ నిరీక్షణలో క్షణమే యుగంలా సాగుతోంది

గాలిలో పరిమళం తెలుపుతోంది నీరాకని

నీ పరిమళమే రాకుంటే ఊపిరి పీల్చనంటుంది నాసిక

ఇంకా కనబడవేమని కళ్లు తమను తాము శపించుకుంటున్నాయి..

ఏ మాయ చేసావు నా కళ్ళు నిను తప్ప  వేరేది చూడనంటున్నాయి

చెవులకు నీ అడుగుల సడి వినబడక నిట్టూరుస్తున్నాయి

కాళ్లకు ఏ ప్రేమ పాశం వేసావొ

నువొచ్చే దారివైపే అడుగులు పడుతున్నాయి.

నీ పాద స్పర్శకి వేచి అహల్య నవనా

నీకోసం కరిగే కన్నీరై ఉప్పొంగే నది నవ్వనా

చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు

నిను చుట్టేయని   కర కమలాలు ఎందుకు దండగ

నీకై వేచే అభిసారికకకై రావా కన రావా

గొంతులో కొట్లాడే గుండె తనలో నువ్వున్నావని చెబుతోంది

నువ్విక రాకుంటే నీ నిర్లక్ష్యపు ఆవలి గట్టున ఆగిపోతానంటోంది మది మరి.

అరుణ చామర్తి ముటుకూరు, హనుమకొండ

Related posts

జూలై 10న ముగియనున్న యుద్ధ‌కాండ పారాయ‌ణం

Satyam NEWS

సెన్సార్ కార్యక్రమాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

మెకానిక్ చిత్రం మంచి విజయం సాధించాలి

Satyam NEWS

Leave a Comment