39.2 C
Hyderabad
April 28, 2024 14: 01 PM
Slider ప్రత్యేకం

పాలకులే పశువులైతే ప్రజల పరిస్థితి ఏమిటి?

#raghurama

పాలకులే పశువులైతే ప్రజల పరిస్థితి ఏమిటి? వీళ్ళ నుంచి ప్రజలకు విముక్తి లేదా అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనుమూరి  రఘు రామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒక కంపెనీలో నిబద్ధతతో పనిచేసే ఉద్యోగికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మనము మనుషులమే కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆకృత్యాలను అందరం కలిసి మూకుమ్మడిగా  ప్రతిఘటిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటువంటి అరాచక,  అనాగరిక, ఆటవిక కుట్ర నీతిని బహిరంగంగా వ్యతిరేకిద్దాం. గతంలో నన్ను అపహరించి పోలీస్ లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. అంతకుముందు టిడిపి  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ని శారీరకంగా హింసించి, ఇబ్బంది పెట్టారు. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులపైనే కక్షపూరితంగా వ్యవహరించారని భావించాం. కానీ ఇప్పుడు సామాన్య ఉద్యోగులను సైతం వేధిస్తున్నారు. 

పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని  ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ  దారుణ అకృత్యాలను  ప్రజలంతా మూకుమ్మడిగా  వ్యతిరేకించాలి.  ప్రశ్నిస్తే హింసిస్తారని ఇంకెన్నాళ్లని భయపడదాం. హింసలో ఆనందాన్ని వెతుక్కుంటాడు మా జగన్మోహనుడు అని ఆయన మండిపడ్డారు. మార్గదర్శి సంస్థ పై సిఐడి ద్వారా అక్రమ కేసులను నమోదు చేయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు.

ముఖ్యమంత్రి ఒత్తిడిని  తట్టుకోలేక సిఐడి చీఫ్  సంజయ్ కు  గుండె నొప్పి వచ్చి,  సర్జరీ జరిగింది. నన్ను కిడ్నాప్ చేసి లాకప్ లో చిత్రహింసలు పెట్టినట్టు గా, రామోజీ రావు ని కూడా అపహరించాలన్నదే  వారి పథకం. సిఐడి చివరకు ఏమీ చేయలేక ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, మార్గదర్శి సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న  శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని  ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే  అపహరించి అరెస్టు చేశారు.

శ్రీనివాసరావు ఆచూకీ గురించి  కనీసం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణం. ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలోనే తనఖా పెట్టిన ఆస్థి పై, రెండవసారి మార్గదర్శి సంస్థ నుంచి  రుణం ఇవ్వాలని కోరగా  నిరాకరించడమే శ్రీనివాసరావు చేసిన తప్పు. ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉదయాన్నే ఫిర్యాదు చేయగానే, అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న  శ్రీనివాసరావును ఆగమేఘాలమీద  అరెస్టు చేసి  కనీసం ఎక్కడ ఉన్నాడో కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం దుర్మార్గం. ఇదే విషయమై పోలీస్ ఉన్నతాధికారి టాటాను  ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పలేదు.

ఎవరైనా ఫిర్యాదు చేయగానే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా  అపహరించినట్లుగా అరెస్టు చేస్తారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి,  అక్రమాలను… ప్రజలకు నిజాలను తెలియజేస్తున్న  ఈనాడు దినపత్రిక పై కక్షతోనే, మార్గదర్శి సంస్థపై  సిఐడి ని  ప్రోత్సహించి తప్పుడు   కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చూశారు. రామోజీరావును ఏమీ చేయలేక, ఆయన సంస్థ లో పనిచేస్తున్న  ఉద్యోగులను హింసించడం ప్రజాస్వామ్యమా? వ్యక్తులుగా మనం ప్రశ్నించలేమా? కొడితే కొట్టించుకోవాలా? అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం? ఛీ అసలు సిగ్గుందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామని   ప్రజలను రఘురామకృష్ణం రాజు కోరారు.

చేనేత నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నేతన్నల గురించి మాట్లాడకుండా, రాజకీయాలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని, లోకేష్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. యధావిధిగా  చంద్రబాబు నాయుడు పై  ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై, టీవీ5 యజమాని  రాజగోపాల్ నాయుడు పై తన అక్కసు ను వెళ్లగక్కారు .

ఇతరుల వ్యక్తిగత జీవితాలపై  ఎక్కువ అబద్దాలతో  శృతిమించిన ఆరోప ణలు  చేయడం,జమోరె కు అంత “శ్రేయ ” స్కరం కాదని అనుకుంటున్నాను.  ప్రతి వ్యక్తికి గతం అనేది ఉంటుంది. దాన్నే వ్యక్తిగతం అంటారు.  కాలేజీలో చదువుకునే విద్యార్థి తన తోటి  విద్యార్థులతో సరదాగా గడపడమనేది సర్వసాధారణం. ఆ విషయం కాలేజీకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. జమోరె చదువుకున్నట్టు లేదు. నారా లోకేష్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన  స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చదువుకుంటే , ఎక్కడ చదువుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. శివ శివాని విద్యాసంస్థలో జగన్మోహన్ రెడ్డి

పరీక్ష పత్రాలను దొంగిలించి  అమ్ముకున్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలపై  తన పరువుకు నష్టం వాటిల్లిందని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, ఆయనపై    కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. స్నేహితులతో కలిసి మద్యం సేవించడం అనేది సర్వసాధారణమైన విషయం. పాతికేళ్ల  మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదా?.

చీకట్లో ఎన్ని వెధవ వేషాలైనా వేసి, ఫోటోలకు దొరకని వారు ఏమైనా ఋషులు,  మహర్షులా? అని ప్రశ్నించారు. తనకు వివాహాలు కలిసి రాలేదని పవన్ కళ్యాణ్ బాహాటంగానే చెప్పారు. ఇద్దరు మహిళలతో పరస్పర అంగీకారం మేరకు ఆయన విడాకులు తీసుకుని మూడవ పెళ్లి చేసుకున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి  అర్థం లేని వ్యర్ధమైన ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం అని రఘురామకృష్ణం రాజు  ప్రశ్నించారు. ఈ తరహా  వ్యాఖ్యల వల్ల, ప్రజలు అసహ్యించుకుంటారనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఏమి చేయగలమన్నారు.

చేనేత నేస్తం కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతుండడంతో  వెంకటగిరిలో  పాతిక, 30 ఏళ్లుగా  ఏపుగా పెరిగిన వృక్షాలను  నేలమట్టం చేశారు. ఏపుగా ఎదిగిన చెట్లను కొట్టివేయడం దారుణమని రఘు రామకృష్ణంరాజు మండిపడ్డారు. హవ్వ… ప్రభుత్వమే పరువు నష్టం దావా వేయడమా?… వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు … ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఏమీ అనలేదు.

వ్యక్తిగత వివరాలను  సేకరించి వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న యూనికాన్ సంస్థకు  అందజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కుల లో భాగంగా వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించడమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని  రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఒంటరి మహిళల అదృశ్యానికి  ఇది ఒక కారణమై ఉండవచ్చని మాత్రమే ఆయన అన్నారు. రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యమైతే, వారిలో 18 వేల మంది మహిళలు తిరిగి ఇంటికి చేరగా, మిగిలిన వారి వివరాలు తెలియడం లేదని  పవన్ పేర్కొన్నారు. ఒక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ పై  పత్రికల్లో వచ్చిన వార్త కథనాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే పరువు నష్టం దావా  వేయడం అన్నది  ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరిచే విధంగా  వ్యాఖ్యలు చేస్తే, వారు పరువు నష్టం దావా వేయడం అన్నది  పరిపాటి.

కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వమే ఉలికిపాటు పడడం  విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలి అంటే  కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి మంగళగిరి కి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ వ్యవస్థ పై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం జరిగిందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

కేవలం  అస్తవ్యస్తంగా కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థ గురించి మాత్రమే  పవన్ కళ్యాణ్  మాట్లాడారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని  ఆయన రాజకీయ సలహాదారుడిని, మంత్రులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే  వారిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం నియమించాల్సి ఉంటుంది.

ఆర్టికల్16 -1 ప్రకారం నియామకాల్లో అమల్లో ఉన్న రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించి నియామక పత్రం అందజేస్తేనే  వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాల్సి  ఉంటుంది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, రాజ్యాంగ నిబంధనల మేరకు  నియమావళిని అనుసరించి  30 వేల రూపాయల వేతనం అందజేసి  నియమించాలి.

ఇక పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరువు నష్టం దావా నోటీసులు ప్రాథమిక కోర్టులోనే కొట్టి వేయబడతాయి. అలా కాదని రాజ్యాంగ విచక్షణ లేకుండా న్యాయమూర్తులు ఎవరైనా  ఆర్డర్ ఇస్తే ఇవ్వవచ్చు  కానీ హైకోర్టులో మాత్రం ఈ కేసు నిలబడదు. ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఏమీ అనకపోవడం తో పాటు  వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాక పోవడం వల్ల  న్యాయ స్థానం ఈ కేసును పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా  అభిమానించే వ్యక్తిగా నోటీసుల విషయంలో ఎవరూ కంగారు పడవద్దని కోరుతున్నాను . రాష్ట్ర ప్రభుత్వం,  పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన నోటీసులను ఆధారంగా చేసుకుని సాక్షి మీడియా  అభూత కల్పనలను ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ అరెస్ట్ కావడం ఖాయమని, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారని, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడ వుతాడని సాక్షి మీడియా యాంకర్ నోటికొచ్చినట్లు  మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించారు. సాక్షి మీడియాలో ప్రసారమైన వార్తా కథనం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. న్యాయస్థానంలో ఏ తీర్పు వస్తుందోనని సాక్షి మీడియా ముందే ఊహించి చెబుతుందా? తెలియని తనముతో, తెలివి లేని తనంతో సాక్షి మీడియా సాక్షిగా  సాగిన ఈ వికృతక్రీడను ప్రజలంతా గమనించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

నాపై దాడి చేయించాలన్నదే వారి ప్లాన్

పార్లమెంట్ లో విశాఖపట్నం ఎంపీ ఎం వి వి  సత్యనారాయణ చేత నాపై దాడి చేయించాలన్నదే మా పార్టీ పెద్దల ప్లాన్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  విశాఖపట్నం రీజినల్ కోఆర్డినేటర్ గా  వ్యవహరిస్తున్న సుబ్బారెడ్డి  సూచనలతోనే పార్లమెంటు సెంట్రల్ హాల్లో  సత్యనారాయణ నన్ను అసభ్య పదజాలంతో దూషించారు.  పార్లమెంట్లో నాపై దాడి చేయించాలని, ప్రతిగా  నేను కూడా ఆయన పై చేయి చేసుకుని ఉంటే  నాపై స్థానిక పోలీసుల తో కేసు పెట్టించి అరెస్టు చేయాలన్నది వారి కుట్రలో భాగం. గతంలోనూ ఎంపీ గోరంట్ల మాధవ్ చేత  నన్ను దూషించేలా చేసి ఆయన్ని హత్య చేసి, ఆ హత్యా నేరాన్ని నాపై మోపాలని కుట్ర చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన నేను మీడియా ముఖంగా   హెచ్చరించడం వల్లే  గోరంట్ల మాధవ్ బ్రతికి పోయారు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన కుట్ర కోణాన్ని వివరిస్తూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Related posts

దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి కపిల్

Sub Editor

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

Sub Editor 2

తిరుమల శ్రీ‌వారికి కానుక‌గా స్వ‌ర్ణ శంఖుచ‌క్రాలు

Satyam NEWS

Leave a Comment