28.2 C
Hyderabad
May 9, 2024 02: 05 AM
Slider కృష్ణ

విద్యాశాఖలో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్యాబోధన పై సిఎస్ సమీక్ష

#CS review

రాష్ట్రంలో విద్యాశాఖలో కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత విద్యాబోధన అంశం దాని కార్యాచరణపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోదనకు సంబంధించి ఏవిధంగా అమలు చేయాలనే దానిపై పాఠశాల విద్యా,మరియు కళాశాల విద్యాశాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

దీని అమలుకు సంబంధించి ఇటు విద్యార్ధుల్లోను,అటు తల్లిదండ్రుల్లోను పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే ఇందుకు సంబంధించి టెక్నికల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని దానిపై తగిన ప్రతిపాదనలను పంపాలని సిఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

నేడు మొబైల్ యాప్‌ల నుండి ఆన్‌లైన్ కోర్సుల వరకు విద్యలో కృత్రిమ మేధస్సు(AI) వినియోగం విపరీతంగా పెరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.అంతేగాక విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ విద్యా వ్యవస్థలో AIని అమలుపై ఆసక్తి చూపుతున్నారన్నారు.విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కృత్రిమ మేధస్సు గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సిఎస్ డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు మాట్లాడతూ కృత్రిమ మేధస్సుపై అన్ని విశ్వవిద్యాలయాల్లోను ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాన్ని మరియు టెక్నికల్ ల్యాబ్,పరిశోధనకు సంబంధించి విఆర్/ఎఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అంతేగాక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సులో విశ్వవిద్యాలయాల్లో గ్లోబల్ స్టాండర్సుతో కూడిన శిక్షణను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ఉన్నత విద్యమండలి అధ్యక్షలు హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు కోర్సును ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో

ప్రవేశపెట్టామని దీనిపై విద్యార్ధుల్లో మరింత కెపాటిసిటీ బల్డింగ్ కు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఈవిధానంతో రీసెర్చ్ మెథడాలజీని మెరుగు పర్చేందుకు,క్లాస్ రూమ్ మేనేజిమెంట్ కు,పెర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్సఫీరియెన్సెస్ కు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్సు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ గ్లోబల్ ప్రాముఖ్యత గలిగిన ఉపాధ్యాయులతో ప్రతి ఫాఠ్యాంశానికి సంబంధించి ప్రీ రికార్డెడ్ వీడియో రూపొందించి విద్యార్ధులకు విద్యాబోధన చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సు ద్వారా విద్యా బోధనకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన మట్లాడారు.

ఈ సమావేశంలో రాష్ట్ర స్కూల్ ఇన్ప్రాస్ట్రక్చర్ కమిషనర్ పి.భాస్కర్,పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్,ఇంటర్మీడియెట్ బోర్డు కమీషనర్ సౌరవ్ గౌర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related posts

పాదయాత్రకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి, పాల్గొంటే తప్పేంటి?

Bhavani

48 టన్నుల రాయితీ బియ్యం పట్టుకున్న  టాస్క్ ఫోర్స్ పోలీసులు

Satyam NEWS

దేశాన్ని కాపాడేందుకే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి !

Satyam NEWS

Leave a Comment