38.2 C
Hyderabad
April 29, 2024 22: 21 PM
Slider గుంటూరు

సందడిగా సాగుతున్న పల్నాడు సంబరాలు…

#palanadu

నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించిన 6 పళ్ల విభాగంలో పోటీలకు ముఖ్య అతిధులుగా జెడ్పీ చైర్మన్ కత్తెర హేన్రి క్రిస్టినా, గుంటూరు పార్లమెంటు నియోజక వర్గ సమన్వయ కర్త మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. 6 పళ్ల విభాగంలో పోటీ పడుతున్న ఎడ్ల యజమానులకు జ్ఞాపిలకు అందజేశారు.

నిన్న నిర్వహించిన 4 పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్నాడు సంబరాలకు విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీకి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఎడ్ల జతల యజమానులకు కృతజ్ఞతల తెలిపారు. పల్నాడును జిల్లాగా ప్రకటించిన సందర్భంగా నిన్న ముఖ్య మంత్రి ని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాను అని వివారించారు.

గోపిరెడ్డి విజ్ఞప్తి మేరకే నరసరావుపేట జిల్లా కేంద్రం చేయడం జరిగింది అని సీఎం గారు చెప్పినట్లు తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పల్నాడును అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి అని ఆకాంక్షించారు.

Related posts

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇక నుంచి ప్రత్యేక ఎకౌంట్లు?

Satyam NEWS

Update: వై ఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

Bhavani

లార్డ్ వృద్ధాశ్రమంలో అ౦బరాన౦టిన దీపావళి సంబరాలు

Satyam NEWS

Leave a Comment