37.2 C
Hyderabad
May 6, 2024 13: 25 PM
Slider కవి ప్రపంచం

ప్రేమామృతం

#VemulaKotaiah

ఈ సృష్టి ప్రేమ మయం

బంధాలు, అనుబంధాలు ప్రేమకు దాసోహం

ఏ జీవికైనా జీవన ప్రయాణంలో  ప్రేమ ఓ రహదారి

సమైక్య జీవన సౌందర్యంలో ప్రేమే ఊపిరి

ప్రేమ లేక ఈ విశ్వం లేదు

ప్రేమ అనుబంధాల నడుమ వారధి

ఆ వారధి సంతోషాలను కలిగించాలే కానీ

అట్టడుగు లోయలోకి నెట్టరాదు

అందుకు మనం బలికావద్దు

పెరటిలోని మొక్క ప్రేమ పూలు పూసి

సుమధుర పరిమళాలు వెదజల్లాలి

చల్లని వెన్నెలలు కురిపించాలి

అమృతమోలే ఆయుస్సును పెంచాలి

సంతోషాల జల్లు కిరిపించాలి

కానీ,

ఆపదలు కలిగించొద్దు

ప్రేమ ఆయుధమై కాపాడాలి కానీ,

శత్రువై అంతం చేయరాదు

అయినవారి నయనాలలో కన్నీటిని పారించొద్దు

అందరిలో ఉన్న ప్రేమ

అవనియంత ఉన్న ప్రేమ

కాపాడాలి గాని,

కాటికి పంపించవద్దు

వేముల కోటయ్య, అనంతవరం, నాగర్ కర్నూల్, చరవాణి:- 9441455261

Related posts

వ్యాయామం చేయడం వల్ల ప్రతి ఒక్కరు దృఢంగా ఉంటారు

Satyam NEWS

శుభకార్యానికి వెళ్లి వస్తూ వ్య‌క్తి మృతి

Sub Editor

హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్ధిక సాయం చేయండి

Satyam NEWS

Leave a Comment