38.2 C
Hyderabad
May 5, 2024 22: 19 PM
Slider ప్రత్యేకం

మేం చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

#puvvada

‘సత్యం న్యూస్’ తో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే తనను మళ్ళీ గెలిపిస్తాయని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి, ఖమ్మం ఎం‌ఎల్‌ఏ పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రజల మధ్యనే వుంటూ పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న ఆయన ‘సత్యం న్యూస్’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పలు అంశాలను వివరించారు. ఖమ్మం ప్రజల మద్దతు గతంలో తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు పైన , ఇప్పుడు తనపైనా వున్నదన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరగటం, ఇక్కడే చదువుకోవటం వల్ల తనకు ఖమ్మంతోనే అనుబంధం అన్నారు.

2014,2018 ఎన్నికలలో ఖమ్మం ప్రజలు తనకు మద్దతుగా నిలిచారన్నారు. ఖమ్మం పై పూర్తి అవగాహన ఉండటంతో గెలిచిన తర్వాత తొలిరోజు నుంచే అభివృద్ధిపై దృష్టి పెట్టి, ఖమ్మం ప్రజల మదిలో నిలిచానన్నారు. ఇటీవల ఖమ్మంలో  జరిగిన  తాను చదువుకున్న శాంతినగర్ కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో తన ఆత్మీయ సమ్మేళనంలో నాటి తన స్నేహితులంతా కలిశారని, నాటి అనేక విషయాలను గుర్తు చేసుకున్నామని, తన మిత్రులు తాము చదువుకున్నప్పుడు వున్న ఖమ్మంకు, ఇప్పటి ఖమ్మంకు వ్యత్యాసం, అభివృద్ది గురించి మాట్లాడుకున్నప్పుడు గర్వంగా అనిపించిందన్నారు.

తన పదవీకాలంలో ఖమ్మంను రాష్ట్రంలోనే అభివృద్ది చెందిన నగరంగా తీర్చిదిద్దటంలో సఫలం చెందానన్నారు. ఖమ్మం నగరం కు అన్నీ వైపులా రోడ్ల అభివృద్ది, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల అభివృద్ది కనిపిస్తుందన్నారు. అలాగే ప్రతి ఇంటికి నల్ల కనక్షన్ ఇచ్చామని చెప్పారు. మరోపైవు ఖమ్మం నియోజకవర్గంలోనే వున్న రఘునాధపాలెం మండల అభివృద్దిని చూసి రాష్ట్రంలోనే మోడల్ గా వుండని కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్, లాంటి వారు అనేక మార్లు చెప్పారన్నారు. రఘునాధపాలెం మండలం లో ప్రతి గ్రామానికి రోడ్లు, అన్నీ గ్రామాలలో హై మాస్ట్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు.

ఖమ్మం నగరంలో 13 కిలోమీటర్ల మేర ప్రవహించే గొల్లపాడు చానల్ మురుగు కాల్వను ఆధునీకరించి, కాల్వ కనిపించకుండా, అందమైన పార్కులతో తీర్చిదిద్దామని, ఇది తన జీవితంలో గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఎంతో మంది నేతలకు సాధ్యం కానీ పనిని కే‌సి‌ఆర్ నేతృత్వంలో తాను చేసి చూపించానని, ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలంతా ఆనందంగా వున్నారని స్పష్టం చేశారు. గొల్లపాడు చానల్ పనులు ప్రారంభించినప్పుడు ఎద్దేవా చేసిన వారు, పనులు పూర్తయ్యాక అభినందించటం గ్రావంగా వుందన్నారు. 

అభివృద్దికి తోడు సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా ఖమ్మం ముందంజలో వున్నదని పువ్వాడ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8733 మందికి గాను 82.41 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తానే స్వయంగా అందించానన్నారు. అందులో 90 శాతం మందికి తానే నేరుగా వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వారి ఆనందంలో పాలుపంచుకున్నానన్నారు. అలాగే అనారోగ్యంతో వివిధ చికిత్సలు చేయించుకున్న 5124 మందికి 20.48 కోట్ల రూపాయలు అందించానని చెప్పారు. ఇవి కాక, ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, బి‌సి బంధు,మైనారిటీ  బంధు ద్వారా అనేక మందికి ఆర్ధిక సాయం చేసినట్లు వెల్లడించారు. దాదాపు 3వేల మందికి ఇళ్ల పట్టాలు, మరో 2000 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చామని, ఇవి రాష్ట్రంలోనే అత్యధికమని గుర్తుచేశారు.  హైదరాబాద్ తర్వాత అతి పెద్ద బస్టాండ్ ను ఖమ్మం లో నిర్మించామని, ఖమ్మం నగరం ఎటుచూసినా, ఎక్కడ చూసినా అందంగా వుండేలా తయారుచేశామన్నారు.

ఇటీవల మున్నేరుకు వరద వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, దానికి శాశ్వత పరిష్కారం కోసం 690 కోట్ల తో 35 అడుగుల మేర మున్నేరుకు ఇరువైపుల వరద రాకుండా గోడ నిర్మిస్తున్నామని, అలాగే మున్నేరుపై 160 కోట్ల తో కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతాన్ని మున్నేరు రివర్ ఫ్రంట్ పేరుతో  ఆధునీకరించి అందంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఖమ్మం నగరం లో లకారం టాంక్ బండ్ రాష్ట్రంలోనే హైదరాబాద్ తరువాత అద్భుతమైనదిగా వున్నదని, ప్రస్తుతం అది పర్యాటక ప్రాంతంగా మారిందని, ఇతర ప్రాంతాలనుండి కూడా దానిని చూసేందుకు పర్యాటకులు వస్తుండటం గర్వంగా వుందన్నారు. అక్కడే ఇటీవల తెలుగు ప్రజల ఆరాధ్య నేత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు. ఖమ్మం ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైoదన్నారు. ఖమ్మం బిడ్డగా తన పదవీ కాలం తనకి సంతృప్తిని ఇచ్చిందని, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు గతంలో యెవరు చేని విధంగా సేవ చేశానని, తాను గ్రామాలకు, డివిజన్ లకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అభివృద్ది చూసి ప్రజలు తనకు నీరాజనాలు పలుకుతుంటే ఆ ఆనందం చెప్పలేనిదన్నారు. తాను యెల్లప్పుడు ఖమ్మం బిడ్డగా ఇక్కడే వుంటూ వారి అభివృద్ది లో పాలుపంచుకుంటానని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

తాళ్లూరి మురళీకృష్ణ

Related posts

రైతుల మీద తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు హాస్యాస్పదం

Satyam NEWS

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

Murali Krishna

లాక్ డౌన్ బాధితుల ఆకలి తీరుస్తున్నఎన్టీఆర్ అభిమానులు

Satyam NEWS

Leave a Comment