29.7 C
Hyderabad
May 7, 2024 03: 10 AM
Slider కవి ప్రపంచం

అక్షర మాల

#K.Haranath New Photo

అడుగడుగున
గుర్తుకొస్తుందా చెలియ
అణువణువునా
ఆవరించుకుందా మగువ
నా శిరస్సున గంగలా
ప్రవహిస్తుందా వనిత
ప్రేమ గనితో పసిడి చాయ
ఆ వనితానిత జనిత
కాల ప్రవాహంలో
కాలంతో కలిసి రావాలని
కాలమే మమ్ము కలపాలని
కోరుకుంటున్న
విరహ వేదనుడీ కవి
క్షణం క్షణం నిరీక్షణే
రక్షణ కవచం
మనసున్న మారాణి
ఆ రేరాణికి
తీయని తేనెల రసధారలతో
ఈ శుభారుణ శుభదిన
శుభోదయంతో
అక్షర మాలను వేస్తున్నాను
అందుకొనుము నా చెలియా
ఓ…నా ప్రియ సఖీ

కె.హరనాధ్, 9703542598

Related posts

ప్రతి యూనిట్ పై పర్యవేక్షణ

Murali Krishna

‘ ఫ్లై హై టూరిజం’ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి

Bhavani

ద్వివేదీ, గిరిజాశంకర్ లకు ఎన్నికల కమిషనర్ అభిశంసన

Satyam NEWS

Leave a Comment