37.2 C
Hyderabad
May 6, 2024 21: 04 PM
కవి ప్రపంచం

శోభయమాన శుభకృత్

#basa munjula

ఆమని రాకతో ఆనందం వెల్లివిరిసి

పచ్చకోక కట్టి ప్రకృతి ముస్తబయిన వేళన

చెట్లుపచ్చని చివుళ్లతో అలరింపజేయగా

వేపపూత ధవళవర్ణ సొభగులద్దగా

గుత్తులతో మావిపిందెలు కనువిందు చేయగా

కోకిలవాసపు గుబురులో కోయిల కుజీతాలు తీయగా

తెలుగు లోగిల్లు ఆనంద హరవిల్లులయ్యెను

గుమ్మాలకు పచ్చని మామిడి తోరణలలంకరించి

ఇంటిముందు రంగు రంగుల రంగవల్లికలద్ది

యుగానికే ఆది యుగాది కన్యకను ఆహ్వానించగా….

గతకాలపు విషాదాలను గతింపజేసీ

అమావాస్యన ప్లవకు వీడ్కోలు పలికి

చైత్రశుద్ధ పాడ్యమిన శోభయమానంగా శుభా లనొసాగాలని విచ్చేస్తున్నది శుభకృత్ నామ నూతన వత్సరం

వగరు,పులుపు,చేదు,తీపి ఉప్పు,కారం. షడ్ రుచుల మేళవింపు ఉగాది పచ్చడి

కష్టసుఖాలు ప్రేమానురాగాలు ఈర్ష్య ద్వేషాలు సమంగా స్వీకరించాలనే జీవిత సారాన్ని తెలియజేస్తుంది

భక్తి భావంతో దేవాలయ దర్శనాలు

సాయంకాలం ఆదాయ కందాయ ఫలాల వివరించు పంచాంగ శ్రవణం ఆలకిస్తు…

సంబరాలు సంతోషాలతో జరుపుకునే ఉగాది

మానవాళికి ఆయురారోగ్యాలనిస్తూ సర్వత్ శుభాలు కలుగజేయాలని శుభకృత్   ను స్వాగతిస్తున్నాము…

బాస మంజుల, మెట్ పెల్లి, జగిత్యాల జిల్లా, చరవాణి :8688620478

Related posts

చైత్రా రావే

Satyam NEWS

రాజకీయ ఋషి

Satyam NEWS

సత్తాగల్గిన సౌమ్యశీలి

Satyam NEWS

Leave a Comment