33.7 C
Hyderabad
April 29, 2024 23: 33 PM
కవి ప్రపంచం

రాజకీయ ఋషి

#Sailaja Mitra

గడచిన కాలంలో

ఇప్పటికి ఎదురవుతున్ననాయకుడు పివి

ఒక వ్యక్తిగా కాదు. ఒక చరిత్రగా

దేశం దేహమ్మీద మిగిలిన ముద్ర ..పివి

రాయకీయ చిట్టడవిలో

ఇప్పటికి స్పష్టంగా కనిపించే కాలి బాట మన పివి

జ్ఞాపకాలపై రాజకీయం రాజ్యమేలినప్పుడు

దశాబ్దాల దార్శనికుల్లో

రాజకీయ ఋషుల ప్రతిబింబాలు దర్శనం ఇస్తాయి

నిజపుత్రుల కర్తవ్యంతో తడిసిన

మహనీయమైన ఆలోచనల్లో

మిగిలిన ఒకే ఒక్క శక్తి పివి నరసింహరావు

చెదలు పట్టిన చరిత్ర పుటల్లో దొరికిన

అద్భుత అరుదైన కావ్యం లా

మనసు లేని శిధిలాల  మధ్య

తరతరాల వాస్తవం లా తారసపడ్డారు

ఇలాంటప్పుడే

మట్టి నేలలే కాదు  కఠిన శిలలు కూడా నవ్వుతాయి

గడిచిపోయిన మంచిని గుర్తుంచుకోవడానికి

ముత్యాల్ని వెదజల్లినట్లు

దేవుడు జల్లిన ఒక ముత్యం మన పివి.

పివి చరిత్ర కాలము,

 మనకు మిగిలిన పర్యాయ పదాలు

నిజానికి

ఒక పివి  మళ్ళీ ఎదురవ్వకపోవచ్చు

ఇక్కడొక మహనీయుడు ఉండేవారని

గుర్తిస్తే చాలు

అది, మళ్ళీ పివి పరిపాలనే అవుతుంది

శైలజామిత్ర, హైదరాబాద్

Related posts

“నాన్న”

Satyam NEWS

స్థిత ప్రజ్ఞాశాలి పీవీ

Satyam NEWS

హంపీ సుందరి

Satyam NEWS

Leave a Comment