27.7 C
Hyderabad
May 12, 2024 06: 10 AM
Slider ఖమ్మం

రుణాలు మంజూరు చేయాలి

#anudeep

రానున్న మూడు నెలల్లో నిర్దేశించిన లక్ష్యం మేర రుణాలు మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ సమావేశపు హాలులో  వార్షిక రుణాలు మంజూరు పై అన్ని శాఖల బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లకు నిర్దేశించిన మేర రుణాలు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు.  రుణాలు మంజూరు పై అన్ని శాఖల బ్యాంక్ అధికారులు నివేదిక అందజేయాలని ఆయన సూచించారు.  సమావేశానికి గైర్హాజరైన ఐఓబీ  మేనేజరపై రాష్ట్ర, ప్రాంతీయ అధికారులకు   రేఖ రాయాలని ఎల్డిఎంకు సూచించారు.  ప్రయారిటీ రంగాలకు కాకుండా నాన్ ప్రయారిటీ రంగాలకు రుణాలు బాగానే ఇస్తున్నారు కానీ ప్రయార్టీ రంగాలకు నిర్దేశించిన  విదంగా ఎందుకు  రుణాలు మంజూరు చేయటం లేదని కారణాలను తెలియచేస్తూ నివేదిక అందజేయాలని చెప్పారు. 

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం, ముద్ర రుణాలు మంజూరుకు కొలెసట్రాల్ సెక్యూరిటీ అవసరం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు.  మైక్రో ఎంటర్ప్రైైనర్ రుణాలు మంజూరు పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం,  మైక్రోఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు పై నిరంతర సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో ఎల్డిఎం రామిరెడ్డి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు,  ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం,  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సీతారాం,  ఉద్యానవనాధికారి మరియన్న,  అన్ని శాఖల  బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వారూ పీఆర్సీ పరిధిలోకి…

Bhavani

రాష్ట్రపతి కి శస్త్రచికిత్స

Satyam NEWS

జూమ్ యాప్ ద్వారా బ్రాహ్మణ వివాహ వేదిక

Satyam NEWS

Leave a Comment