37.2 C
Hyderabad
May 2, 2024 14: 18 PM
Slider వరంగల్

తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

#postoffice

గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న తంతి తపాలా కార్యాలయాలను ప్రజలు వినియోగించుకోవాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ములుగు సబ్ డివిజన్ అధికారి సిహెచ్. రామ్మూర్తి కోరారు. ములుగు మండలంలో బుధవారం రోజున చింతలపల్లి, పోట్లాపూర్ గ్రామాలలో ఆ గ్రామాల సర్పంచులు గద్దల రేణుక, కుమ్మెత లత, MPTC నునావత్ మహేష్ నాయక్ తో కలిసి  తపాలా కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పోస్టాఫీసు ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా అన్ని రకాల సేవలను, నగదు లావాదేవీలను మరియు ఎస్ బి, ఆర్ డి, టీడీ , సుకన్య సమృద్ధి అకౌంట్, గ్రామీణ తపాలా జీవిత భీమా, ఐపిపిబి మొదలగు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఓ జగదీష్ గారు, జంగాలపల్లి సబ్ పోస్ట్మాస్టర్ రాజ్ కుమార్ గారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లు గుండాల అనూష, భానోత్ అరవింద్, అజ్మీర రవీందర్, అడ్డగుడి కల్పన,యండి అంకుష్ వార్డు మెంబర్లు మంద ప్రభాకర్, ముత్త సంపత్ ఆ ఆ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఏపి సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పిల్లుట్ల రఘు

Bhavani

కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా డబుల్ ఇండ్ల గృహ ప్రవేశం

Satyam NEWS

స్వర్ణభారత్ సేవలు ప్రశంసనీయం: కేంద్ర సహాయ మంత్రి

Satyam NEWS

Leave a Comment