27.7 C
Hyderabad
May 7, 2024 08: 54 AM
Slider మహబూబ్ నగర్

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల వితరణ

#kollapur

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని శ్రీ సత్యసాయి సేవా సమితి స్థానిక గాంధీ ఉన్నత పాఠశాలకు పుస్తకాలను వితరణ చేశారు. అదే విధంగా విద్యార్థులకు కథల పుస్తకాలు వాటితో బాటు కరోనా మాస్కులు కూడా  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు,  సీనియర్ న్యాయవాది శ్రీనివాస రావు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని నీతి వాక్యాన్ని విద్యార్థులకు మరొక్కసారి గుర్తు తెచ్చారు. సేవా సమితి మహిళా సభ్యురాలు డాక్టర్ హిమ కుమారి మాట్లాడుతూ కరోనా అయిపోయింది అని విద్యార్థులు నిర్లక్ష్యం చేయవద్దు అని తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని  పరిశుభ్రతను పాటిస్తే మన లోపల ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సేవా సమితి సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, రాధమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బంగారు శోభారాణి పాల్గొన్నారు.

Related posts

బార్ ఓనర్లకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

Satyam NEWS

సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కు బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment