29.7 C
Hyderabad
May 1, 2024 10: 37 AM
Slider చిత్తూరు

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

#balijacastmeeting

వచ్చే  ఎన్నికల్లో  జనాభా ప్రాతిపదికనే  అన్ని  రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు జరపాలని గ్రేటర్ రాయలసీమ బలిజ ప్రముఖులు  డిమాండ్ చేశారు.  ఆదివారం తిరుపతిలో  గ్రేటర్  రాయలసీమ బలిజ సమన్వయ సమితి సమావేశం జరిగింది.

ఈ సమావేశ లో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల  బలిజ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ సీనియర్  న్యాయవాది పి.గంగయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.రామచంద్రయ్యతో ఇతర  ప్రముఖులు తమ గళాన్ని  వినిపించారు.

అధికార,  ప్రతిపక్ష పార్టీలు బలిజలు పట్ల ఎంతో చిన్న చూపు చూస్తున్నాయని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు, అధికారం ఆ రెండు కులాలు కేనా? అని ఆ వేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి న ఏడు దశాబ్దాల కాలంలో కూడా రాజకీయ పార్టీలకు ఏళ్లు గడుస్తున్నా  రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కు చెందిన  బలిజలు ఓటర్లు గానే మిగిలిపోవాలా? రాజకీయ పదవుల్లో ఊరేగే రెడ్లకు కమ్మవారి కి ఎల్లకాలం, పల్లకీలు మోయాల్సిందేనా? ‘రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టులు, విశ్వవిద్యాలయం విసి పోస్టులు ఎవరు అధికారంలో ఉంటే వారి వారి కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు .

ఈ ఏడు జిల్లాలలో  12 విశ్వ విద్యాలయాలు ఉంటే అందరూ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్ లరు పోస్టుల్లో రెడ్లు తప్ప మరో కులస్తులకు ఇవ్వలేదని విమర్సించారు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఇదేనా అని పలువురు నిలదీశారు.

జనాభా ప్రాతిపదికన అన్ని పార్టీలు ఓట్లు,సీట్లు జనాభా  ప్రాతిపదికన కేటాయించాలని,  ప్రజా స్వామ్యం జనాభా నిష్పత్తి లో నడవాలి. ఒకటి రెండు కులాలు దాదాగిరి, పెత్తనం నడవడానికి వీలులేదన్నారు. ఒకటి,రెండు కులాలదే అధికారం అనే పద్ధతికి స్వస్తి పలకాల్సిందేనని అన్నారు.

రాజకీయ పరిస్థితులు- సామాజిక అభ్యున్నతి” విషయాలు అనే అంశంపై  రాయలసీమ ప్రాంతాల బలిజ సమన్వయ సమితి నాయకులు కూలంకుషంగా చర్చించారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బలిజ నాయకులు వందలాది మంది పాల్గొన్నారు.

గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో  వున్న 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజలకు రాజకీయపరంగా అన్యాయం నేపధ్యంలో ప్రత్యామ్నాయ  మార్గాలు, ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం వుంది. 74మంది శాసనసభ్యుల స్థానాలకు గాను కేవలం ఇద్దరు మాత్రమే బలిజ కులస్తులు శాసనసభ సభలో వుండడం దురదృష్టకర మన్నారు .

అతి తక్కువ శాతం వున్న రెడ్లు, కమ్మ  కులస్థులు అత్యధిక శాతంగా  శాశించే  నిర్ణయం,  సత్తా కలిగిన బలిజ లకు భిక్ష పెట్టడమేమిటని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో  చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు  శాసనసభ్యుడు ఎ.శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యుడు ఎ.ఎస్ మనోహర్,  తిరుపతి మాజీ శాసనసభ్యురాలు ఎం.సుగుణమ్మ , మాజీ సిరిఫెడ్డు  ఛైర్మన్ ఎ.ఎం.రాధాకృష్ణ, సమన్వయ కర్త  సింధూరి పార్కు వెంకయ్య,  బలిజ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు మటం సురేషు,   ప్రధాన కార్యదర్శి వూకా విజయకుమార్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్,  కిరణ్ రాయలు,  డిప్యూటి మేయర్ ముద్ర నారాయణ, కడప జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు,  ఎద్దుల సుబ్బరాయుడు, కర్నూలు జిల్లా నుంచి అజా రామకృష్ణ,  రామచంద్రరావు, ప్రకాశం జిల్లా నుంచి ఆమంచి స్వాములు, నెల్లూరు జిల్లా నుంచి జొన్న రాఘవయ్య , అనంతపురం జిల్లా నుంచి ఇటుక మహేష్, మీడియా సలహాదారు కే. లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూన్ 5 నుండి 9 వ‌ర‌కు అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

Satyam NEWS

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Satyam NEWS

మానసిక ప్రశాంతత కోసం అజ్ఞాతంలోకి డాక్టర్‌ సుధాకర్‌

Satyam NEWS

Leave a Comment