29.7 C
Hyderabad
May 4, 2024 04: 10 AM
Slider గుంటూరు

నరేంద్ర మోడీ కార్పొరేట్ దోపిడిపై సేవ్ ఇండియా ప్రదర్శన

#save india

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత దేశ సంపదలను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడాన్ని కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా సేవ్ ఇండియా కార్యక్రమం జరిగింది. సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎంఐఎం పార్టీ ల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా న రసరావుపేట మార్కెటింగ్ యార్డ్ వద్ద నుంచి మల్లమ్మ సెంటర్, శివుడి బొమ్మ సెంటర్, గడియార స్తంభం సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరిగింది.

మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ముజఫర్ అహ్మద్, సిఐటియు జిల్లా కోశాధికారి డి శివకుమారి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావ్, రైతు సంఘం నాయకులు మెట్టు కోటిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి తాళ్లూరి పెద్దిరాజు, ఎంఐఎం నాయకులు షేక్ మస్తాన్ వలీ, కరీముల్లా, మౌలాలి, సిఐటియు మండల కార్యదర్శి సిలార్ మసూద్,

కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి కోండ్రు  ఆంజనేయులు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్, ఎస్ఎఫ్ఐ నాయకులు ధోని నాయక్, ఎల్ఐసి నాయకులు రబ్బాని, నబి రసూల్, మేడం ఆంజనేయులు, జన విజ్ఞాన వేదిక నాయకులు సుభాష్ చంద్ర బోస్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి వైధనా వెంకట్, ఏఐటీయూసీ మండల నాయకులు ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా రైతులు దేశ రాజధాని లో సొంత పొలాలను, గ్రామాలను వదిలి దుర్మార్గమైన రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉంటే, రైతుల కోసం రైతులకు ఉపయోగం లేని చట్టాలను రైతాంగంపై బలవంతంగా రుద్దడానికి కార్పొరేట్ శక్తుల అండతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా రైతుల గొంతులు కోయడం దుర్మార్గమనీ, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగ మార్చి కార్మిక వర్గానికి అరకొరగా అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సిగ్గుచేటని, దేశ ప్రజల సంపదలైనా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు బడా పెట్టుబడిదారులకు అయినకాడికి తెగ నమ్మడం దేశద్రోహం చర్యని దేశ ప్రజల రక్షణ కోసం దేశ రక్షణ కోసం మరో స్వతంత్ర పోరాటానికి నాంది గా సేవ్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని ఇది ప్రారంభం మాత్రమేనని ప్రభుత్వరంగ రక్షణ కోసం కొనసాగింపుగా పని చేస్తామని అన్నారు

రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, నాలుగు  లేబర్ కోళ్లను ఉపసంహరించుకోవాలని, పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ఆపాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఆదాయపన్ను పరిధిలోకి రాని పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతుల రక్షణ కోసం చట్టం తేవాలని, కరోనా నియంత్రణకు తోడ్పడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని, అదనపు వేతనాలు చెల్లించాలని, పెద్ద ఎత్తున ప్రదర్శన లో  దారి పొడవునా పలు నినాదాలు చేశారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యం న్యూస్

Related posts

గ్రీన్ ఉడ్ పాఠశాలలో హోలీ సంబరాలు

Satyam NEWS

గురజాడ వర్ధంతి కార్యక్రమంలో విజయనగరం పోలీసు బాస్…!

Satyam NEWS

మెకానిక్ చిత్రం మంచి విజయం సాధించాలి

Satyam NEWS

Leave a Comment