31.2 C
Hyderabad
May 2, 2024 23: 14 PM
Slider నల్గొండ

గ్రీన్ ఉడ్ పాఠశాలలో హోలీ సంబరాలు

greenwoodschool

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాలలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ తుమ్మ సరిత మరెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగను వసంత ఋతువులో జరుపుకుంటామని,ఈ కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం,జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారని,అందుకని సహజమైన రంగులను చల్లుకోవడం వల్ల అవి ఔషధముగా పనిచేస్తాయని మన పూర్వీకులు సంప్రదాయముగా రంగులను నిమ్మ,కుంకుమ,పసుపు, బిల్వలను ఉపయోగించి  వనమూలికలను తయారు చేసి ఆ రంగులను చల్లుకునేవరని అన్నారు. అదేవిధంగా ఈ రోజునే రాక్షసుల పరాక్రమం అనేది హోలి దహనంతో అంతం అయిందని అందుకే హోలీ పండుగను సంతోషభరితంగా జరుపుకుంటాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి,కరస్పాండెంట్ కృష్ణారావు, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా: చంద్రబోస్

Bhavani

శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారికి రధం

Satyam NEWS

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్న బిజెపి వాగ్ధానం ఏమైంది?

Satyam NEWS

Leave a Comment