37.2 C
Hyderabad
April 26, 2024 19: 12 PM
Slider మహబూబ్ నగర్

పంట తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

#Agriculture

ప్రత్తి పంట సాగుచేసిన రైతులు పంటలను ఆశించే తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల వ్యవసాయ అధికారి సురేష్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ప్రస్తుతం రైతులు సాగుచేస్తు పూత, గూడ, దశలో ఉన్నటువంటి పత్తి పంటను పరిశీలించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిలో ఎక్కువగా పచ్చ దోమ తామర పురుగు ఉంటుందని దీనికి సంబంధించి ఎసిఫెట్ ఫ్రి ఫ్రోనిల్ పిచికారి తోపాటు గులాబీ రంగు పురుగు నివారణకు ఇమాక్టిన్ బెండోమేట్ ను పిచికారీ చేయాలన్నారు.అలా చేసినట్లైతే గులాబిరంగు రెక్కల పురుగు పెట్టిన గుడ్లను నాశనం చేస్తుందన్నారు. రైతులు ముందు జాగ్రత్తచర్యగా పంటలకు పురుగులు ఆశించకుండా తగు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

రైతులు పంట మార్పిడి చేయకుండా వేసిన పంటలే వేయడం ద్వారా భూమి పొరల్లో పురుగులు నాశనం కావడం లేదన్నారు.తెగుళ్ల బెడద,కీటకాల నివారణకు సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రావణి,యామిని తదితరులు పాల్గొన్నారు.

Related posts

Solidarity: మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వారూ పీఆర్సీ పరిధిలోకి…

Bhavani

19 ఏళ్ల యువతి మిస్సింగ్: పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment