39.2 C
Hyderabad
May 4, 2024 20: 06 PM
Slider ఖమ్మం

మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప‌థ‌కాలు

#women`s day

మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప్రభుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తుందని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో ఆరోగ్య మహిళ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  శ్రీభక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా రాణిస్తున్నారని అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీములను ఏర్పాటుచేసింది మన రాష్ట్రమేనని ఆయన తెలిపారు. శాంతిభద్రతలలో మహిళలకు పెద్దపీట వేశామన్నారు.  కేసీఆర్ కిట్ మంచి పథకమన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదని కళ్యాణలక్ష్మి/ శాదిముబారక్ పథకం ప్రవేశపెట్టి అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ పిహెచ్ సి, బస్తీ దవాఖానాల్లో ఏర్పాటువుంటుందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు మగ పిల్లల భావన మార్చాలని, ఆడపిల్లలను సమానంగా చూడాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని ఆయన అన్నారు.

ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్ల‌ల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరిందన్నారు.  కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, మహిళలను గౌరవించే సంస్కృతి, సాంప్రదాయం మన దేశానిదన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజం ముందుకు సాగదన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. వడ్డీ లేని ఋణాలతో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎడగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, కళ్యాణాలక్ష్మి, శాదిముబారక్ పథకంతో వరకట్న వేధింపుల, బాల్య వివాహాలు అరికట్టగలిగామన్నారు.

రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలు దేశానికే ఆదర్శమన్నారు. వడ్డీ లేని రుణాల క్రింద స్వయం సహాయక సంఘాలకు రూ. 40.82 కోట్లు, మెప్మా సంఘాలకు రూ. 24.26 కోట్లు, జిల్లా సమైఖ్యలకు రూ. 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణం అందించినట్లు తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తో అన్ని విభాగాల్లో మహిళలు వచ్చారని, ఇది మంచి పరిపాలన కు సంస్కరణ అని అన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ భూమాత వల్ల, కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే కన్న తల్లి వల్లేనని అన్నారు. తల్లుల కృషి వల్లే ఉన్నతస్థానానికి చేరుకుంటామని ఆయన తెలిపారు. ఇంటింటికి నల్లా తో మహిళల కష్టాలు శాశ్వతంగా తొలగాయన్నారు. ఆడపిల్ల అంటే సమస్యగా భావించేవారని కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథకంతో, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు పెన్షన్ తో తలెత్తుకొని బ్రతుకుతున్నారని అన్నారు.   ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు మహిళలకు ఘనంగా సత్కరించారు.

Related posts

అందరి ముందు అద్భుతం ఆవిష్కరించిన ఆనందయ్య మందు

Satyam NEWS

పాఠాలు చెప్పిన పెద్దసారుకు చిరుచేతుల సాయం

Satyam NEWS

సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

Satyam NEWS

Leave a Comment