37.2 C
Hyderabad
April 26, 2024 22: 00 PM
Slider వరంగల్

ములుగు కోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం

#mulugu

ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కమ్ చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ పి.వి.పి. లలిత శివజ్యోతి  విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8 నాడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం థీమ్ గా సాంకేతికతలో లింగ సమానత్వం తీసుకున్నారని తెలిపారు.

నేటి సమాజంలో ఉన్నత స్థానంలో  ప్రతి రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు వారికి కేటాయించిన పనులను సమర్ధవంతంగా రాణిస్తున్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మన ప్రగతికి మూలం అని గుర్తించుకోవాలి. మహిళల కోసం ఎన్నో రకమైన చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి. స్త్రీ  మూర్తులు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే స్వయంగ నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీ శక్తి ఏంటో  ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. 

ఏ రంగంలోనూ తక్కువ కాదని వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటున్నారు. విద్య వైద్య వ్యాపారాలు రాజకీయాలు క్రీడలు బ్యాంకింగ్ అంతరిక్షం  టెక్నాలజీ ఇవి కాకుండా చివరగా ఇంటి బాధ్యత నిర్వర్తించే మహిళా గా ఓ గృహిణిగా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు నిరంతరం వేస్తున్నారు. మహిళని గౌరవించాలి వారిని తక్కువగా చూడడం కించపరచడం లాంటివి చేయకూడదు. వాళ్లు కూడా మగవారిలానే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు.

పురుషులతో పాటుగా స్త్రీలకు  కూడా సమానంగా అవకాశాలు హక్కులు మొదలైన వాటికి కల్పించడం జరిగింది. స్త్రీలు చదువుకోవడం వల్ల తమ కుటుంబాన్ని పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకోవడం వల్ల నేడు స్త్రీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతట తానే నిలబడే శక్తిని సంపాదిస్తుంది కావున స్త్రీ విద్య స్త్రీ సంపద అనేది పిల్లల భవిష్యత్తుకి కుటుంబ భవిష్యత్తుకు సమాజ శ్రేయస్సుకు దేశ ప్రగతి కి ఉపయోగపడుతుంది అందుకే మహిళలు అక్షరాసులు అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి రామమోహన్ రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్  కుమారి జై సౌఖ్య, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బాలుగు చంద్రయ్య, న్యాయవాదులు వై. నర్సి రెడ్డి, మేకల మహేందర్,ఆర్. బిక్సపతి కన్నోజు సునీల్ కుమార్, కే. రవీందర్ , బి. ప్రతాప్, మేకల మానస, జి. రజిత, బి. నవతా , కోర్ట్ మహిళ  సిబ్బంది, కోర్ట్ మహిళా  కాన్స్టేబుల్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.  

Related posts

పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించిన బీజేపీ నేత

Satyam NEWS

మళ్లీ విడుదల అయిన పగ సాధిస్తా సినిమా

Satyam NEWS

కృష్ణా జిల్లా కు నందమూరి తారక రామారావు పేరు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment