33.2 C
Hyderabad
May 12, 2024 11: 27 AM
Slider రంగారెడ్డి

ఇచ్చింది చిన్న మొత్తమైనా అది పెద్ద సాయమే

school development

మనం  పుట్టిన ఊరికి మనం కొంచెం సహాయం చేద్దాం..ఈ కాన్సెప్ట్ కు ఆకర్షితులయ్యారు ఇంద్రానగర్ ఉపసర్పంచ్ ఎం శేఖర్. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండలం ఇంద్రానగర్ గ్రామంలో ప్రాధమిక పాఠశాలను అభివృద్ధి చేసుకోవడానికి స్థానికంగా విరాళాలు సేకరిస్తున్నారు.

ఇందులో భాగంగా స్కూల్ డెవలప్ మెంట్ కోసం ఇంద్రానగర్ ఉపసర్పంచ్ ఎం శేఖర్ ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు. శేఖర్ లాంటి దాతలు ఇంద్రానగర్ గ్రామానికి చాలా అవసరం. ఇంద్రానగర్ స్కూల్, గ్రామానికి ఇలాంటి దాతలు సహకరిస్తే ఊరు చాలా బాగుంటుంది. మనమే బాగు చేసుకోవచ్చు అని అంటున్నారు గ్రామస్థులు. విరాళాల సేకరణ  కార్యక్రమంలో లో చౌదర్ గూడా మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు హఫీజ్, అక్రం భాయ్ స్కూల్ టీచర్లు,  స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ జబ్బర్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, శివ రాజు, శివ కుమార్ గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Related posts

వూహాన్ లాక్ డౌన్ లో ఉన్న భారతీయుడి అనుభవం ఇది

Satyam NEWS

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

నాలుగు రోజుల్లో గార్బేజ్ తొలగింపుకు స్పెషల్ డ్రైవ్

Satyam NEWS

Leave a Comment