39.2 C
Hyderabad
April 28, 2024 12: 16 PM
Slider మహబూబ్ నగర్

గ్రౌండ్ లెవెల్: డిగ్రీ కాలేజీ విద్యార్ధులకు వనదర్శిని

Vanadarshini

వన్య ప్రాణులు, అటవీ సంపద, పర్యావరణం తదితర అంశాలలో కో కరిక్యులమ్ యాక్టివిటీలో భాగంగా కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్ధులతో అటవీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ వనదర్శిని కార్యక్రమంలో దాదాపు 68 మంది విద్యార్ధులు పాల్గొని అటవీ శాఖ అధికారులతో అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. కళాశాల విద్యార్ధులకు పాడి పరిశ్రమ, సోలార్ విద్యుత్, మొక్కలు, అడవి, వన్య ప్రాణులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవి శాఖ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ ఇ రామరాజు యాదవ్, వైస్ ప్రిన్సిపాల్ ఎం మదన్ మోహన్, లెక్చరర్లు ఎం. మద్దిలేటి, ఎం.కురుమయ్య, సి.రమేష్ కుమార్, ఆర్ రాముడు, డి శివుడు, కె జగన్నాథం, వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో నూతన సంవత్సర వేడుకలు

Satyam NEWS

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు పాస్ లు తీసుకోవాల్సిన అవసరం లేదు

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment