37.2 C
Hyderabad
May 6, 2024 22: 56 PM
Slider ఖమ్మం

రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి

#Bhadrachalam local

గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రెండోవ ఏఎన్ఎం లో సమస్యలు పరిష్కరించాలని, భద్రాచలం స్థానిక దీక్షా శిబిరం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ప్రాజెక్ట్ అధికారి కి వినతి పత్రం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్ మాట్లాడుతూ సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని పై అధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బల్ల సాయికుమార్ మాట్లాడుతూ 2006 నుండి ఇప్పటివరకు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న రెండోవ ఏఎన్ఎం లను ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని 2/2023 జీవో ను రద్దు చేయాలని అన్నారు.

స్వరాష్ట్ర పాలనలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాలు రద్దుచేసి రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.13 రోజులుగా రాష్ట్రం వ్యాప్తంగా రెండవ ఏఎన్ఎంలు సమ్మె చేస్తుంటే గ్రామాల్లో విష జ్వరాలతో అంటూ రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తని విధంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మెను విరమింప చేసే విధంగా చర్చలు జరిపి సమ్మెను విరమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోబాలనాగమ్మ.వీరభద్రమ్మ సమ్మక్క స్వరాజ్యలక్ష్మి విజయలక్ష్మి స్వాతి పూర్ణ పద్మ ముత్తమ్మ శ్యామల భూలక్ష్మి భద్రమ్మ సరస్వతి విజయ సుభద్ర స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

టోల్ ప్లాజా దగ్గర భారీ గా క్యాష్ పట్టివేత

Satyam NEWS

ముగ్గురు దొంగలు అరెస్ట్

Bhavani

అనాథాశ్రమంలో వంటచేసి పిల్లలకు వడ్డించిన కాలేరు పద్మ

Bhavani

Leave a Comment