31.2 C
Hyderabad
May 12, 2024 02: 44 AM
Slider ఖమ్మం

సెక్టోరల్ అధికారులే కీలకం

#vpgowtam

ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్టోరల్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. 

శిక్షణా సామాగ్రి, చేయాల్సిన, చేయకూడని, చెక్ లిస్ట్ , హ్యాండ్ బుక్ లు పంపిణీ చేశామన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. ఇదివరకే విడి విడిగా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు, బుధవారం సంయుక్తంగా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాయని ఆయన అన్నారు. పబ్లిక్ స్థలాల్లో ప్రచార సంబంధ హోర్డింగులు, పోస్టర్లు తదితరాల తొలగింపు చేసినట్లు, ఎక్కడైనా ఇంకా దృష్టిలోకి వస్తే, వెంటనే తొలగించాలన్నారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు క్రియాశీలం అయ్యాయన్నారు. చెక్ పోస్టులు పెట్టడం జరిగిందన్నారు. ఓటరును ప్రభావితం చేసే నగదు, ఆభరణాలు, మద్యం, వస్తువుల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. వారంలోగా మరణించిన, షిఫ్ట్ అయిన, డూప్లికేట్ ఓటర్ల జాబితా తయారుచేసి పీవో కి ఇవ్వాలన్నారు. వల్నరబులిటి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. జాయింట్ అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఓటింగ్ కు భయపడుతున్నవారిని, అభద్రతాభావాన్ని తొలగించి, నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని, ఓటరును భయపెట్టే వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శన చేయాలని, పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కల్గివుండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి వసతుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే దృష్టికి తెచ్చి, వసతుల కల్పన పూర్తి చేయాలన్నారు. యువతతో బూత్ స్థాయి అవేర్ నెస్ బృందాలు ఏర్పాటుచేయాలని, ప్రతి సెక్టార్ పరిధిలో కనీసం 200 మందికి సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేయించి, యాప్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

గత ఎన్నికల్లో లో టర్న్ ఔట్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు స్వీప్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తెచ్చి, ఓటింగ్ లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. క్రొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయినచోట, పోలింగ్ కేంద్రాలు షిఫ్ట్ అయిన చోట ఓటర్లకు ఇట్టి విషయం తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. క్రొత్త ఓటర్లు ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా, బిఎల్ఓ ల ద్వారా ఓటు వివరాలు తెలుసుకొనెలా అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ ఏజెంట్ ల నియామకం పోలింగ్ కు 5 రోజుల ముందు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు, స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్ ఎన్నికల ప్రక్రియపై, పోలింగ్ కు ముందు, పోలింగ్ సందర్భంలో, పోలింగ్ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, రిటర్నింగ్ అధికారులు, ఎసిపిలు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా చక్రస్నానం…

Satyam NEWS

పి.వి రావు మాల మహానాడు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

Leave a Comment