40.2 C
Hyderabad
April 29, 2024 18: 40 PM
Slider ముఖ్యంశాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ

#amithshah

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి ఆయన తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని లోకేష్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగి అమిత్ షా తెలుసుకున్నారు. కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి లోకేష్ వివరించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో అమిత్ షా తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

అన్నవరం వన దుర్గమ్మ ఆలయం లో చండి హోమం

Satyam NEWS

ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా

Satyam NEWS

కొల్లాపూర్ లో ముదిరాజ్ సంఘ భవనం కూల్చివేతపై స్టే

Satyam NEWS

Leave a Comment