28.7 C
Hyderabad
April 28, 2024 03: 50 AM
Slider రంగారెడ్డి

పొలంలో పోషకాల విశ్లేషణపై డాక్టరేట్

#soiltesting

సిబిఐటి కళాశాల సిఎస్ఇ  విభాగంలో  మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ కె స్పందన , ఉస్మానియా విశ్వవిద్యాలయం సి ఎస్ ఇ విభాగం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ  డిగ్రీ పొందినందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతిక ద్వారా వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగబడుతుంది అనే అంశం పై పరిశోధన చేసినట్టు తెలిపారు.  మట్టిని విశ్లేషించడానికి అనేకమైన సహజ పద్దతులు ఉన్నపటికీ, సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి తక్కువ సమయం లో మట్టిలోని పోషకాలను ఎలా కనుగొనవచ్చో మరియు పోషకాల పరిమాణాన్ని బట్టి ఏ పంటను వేయాలో వివరించారు.   నిజామామాబాద్ జిల్లా, సిరికొండ మండలం లో నవ్యనంది గ్రామా మట్టి నమూనాలను సేకరించి ఆ గ్రామంలో మట్టి పోషకాలు ఎలా ఉన్నాయో కనుగొన్నాం అని  తెలిపారు .  ఈ థీసిస్‌కు   సిబిఐటి – ఎఇసి డైరెక్టర్   ప్రొఫెసర్ పబ్బోజీ సురేశ్ మార్గనిర్దేశం చేశారు. సిఎస్ఇ  విభాధిపతి ప్రొఫెసర్ డి రామణ్ ,  ప్రొఫెసర్ వై రామ దేవి,  ఎన్ రామ దేవి,  ప్రొఫెసర్ ఎస్ చిన్న రాము , ప్రొఫెసర్ ఎమ్ స్వామి దాస్, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ అభినందనలు తెలిపారు.

Related posts

లిస్బాన్ పబ్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం

Satyam NEWS

బహుజన్ సమాజ్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షునిగా రాజ శేఖర్

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ పై భిన్న వివరణలు ఎందుకు?: బీజేపీ

Satyam NEWS

Leave a Comment