26.7 C
Hyderabad
May 3, 2024 10: 45 AM
Slider జాతీయం

పీఎం భద్రతా వైఫల్యంపై నవీన్ ట్వీట్‌

పంజాబ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర హోం శాఖ సీరియస్‌ కావడంతో పాటు తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ ఘటనకు కారణమెవరో తేల్చాలని అత్యున్నతస్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంతో పాటు పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ‘ భారత ప్రధానమంత్రి పదవి అనేది రాజ్యాంగ బద్ధమైనది. ఆయనకు పూర్తిస్థాయి భద్రతను అందించడం, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడడం ప్రతి ప్రభుత్వ విధి. ఇలాంటి విరుద్ధమైన ప్రక్రియ ఏదీ కూడా మన ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు..’ అని నవీన్‌ పట్నాయక్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్‌ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఛన్నీ. ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మకు చోటు కల్పించింది.

కాగా ఈ ఘటనపై అధికార బీజేపీ పార్టీ సహా విపక్షాలు పంజాబ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాపరమైన లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆరా తీసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పంజాబ్‌లో జరిగిన భద్రతా లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Related posts

అత్యాచార బాధితురాలికి అసభ్య ప్రశ్నలతో ఇబ్బంది

Satyam NEWS

మన ఇసుక వాహనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి

Satyam NEWS

దాసన్నపేట దోపిడి మ‌ర్చిపోక ముందే విజ‌య‌న‌గ‌రంలో మ‌రో భారీ చోరీ…!

Satyam NEWS

Leave a Comment