38.2 C
Hyderabad
May 3, 2024 21: 49 PM
Slider కవి ప్రపంచం

కాల తరువు

#m.anasuya

ఏ ఏటికాయేడు మొదటి రోజున నూతనోత్సాహ తుంపరలు

ప్రపంచాన్ని తడిపి కాల తరువుకు

కొత్త చిగుళ్ళు

పూచే తరుణాన

నాలో ఎన్నో మధురిమ భావనలకు

కొత్త రెక్కలు తొడిగి అనురాగము ఆత్మీయత మమకారాలనే పూల జల్లులో నగుమోమునై నాలుగు వేదాలు సారాంశం అయిన

విశ్వమంతా విశ్వశాంతికి

నేను సైతం నడుం బిగించి

సామాజిక, ఆర్థిక విభేదాలు బాపి

ఆనందానుభూతులతో నూతన వర్షారంభ  క్షనాలను పునికి పుచ్చుకుంటూ

నా ప్రతి అడుగు

నా జీవిత లక్ష్యాన్ని సమన్వయం చేసుకుంటూ క్రమశిక్షణతో చిరునవ్వు చెదరనీయక

 ఆనంద స్థితి లో ప్రతి పని ఆనందంగా కమ్మని పాయసంలో జీడిపప్పులా,

సాదా సీదా అనుభవాలను సైతం అనుభూతులుగా మనసు కంటూ పూల పరిమళంలా, పసిపాప నవ్వులా, అతి సహజంగా ఎదురుచూస్తూనే ఉంటా.

కాల తరువుకు కొత్త చిగుళ్ళు పూచే తరుణానికై ………

యం.అనసూయ

Related posts

బాలయ్య కొత్త సినిమా: మాస్​ గెటప్​లో ఫస్ట్​లుక్

Satyam NEWS

మృతుడి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

జూన్,జూలై నెలల్లో సమరశీల పోరాటాలు

Bhavani

2 comments

Sheshikala January 9, 2022 at 8:21 PM

Good writing, keep on writing. awaiting for new one

Reply
Satyam NEWS January 10, 2022 at 7:09 PM

Thank you

Reply

Leave a Comment