33.2 C
Hyderabad
May 4, 2024 02: 53 AM
Slider వరంగల్

హరిత హరం పేరుతో పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్

#seetakka

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ రోజు వేంకటా పూర్ మండల కేంద్రంలోని ఎస్టీ నాయకుపొడు కాలనీ ప్రజలతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్య మంత్రి కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇస్తాడు అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు దశాబ్ది కాలములో నిరాశే మిగిలిందని ఆమె అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తా అవసరం అయితే కుర్చీ వేసుకొని మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పడం కూడా దశాబ్ది కాలం అవుతుంది. కానీ పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తా కేజీ టూ పిజి ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తా అని ముఖ్య మంత్రి  చెప్పడం దశాబ్ది కాలం అవుతుంది కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని సీతక్క అన్నారు. మరి ఏమి సాధించారని కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారో మకు అర్థం కావడం లేదు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు ప్రతి పేద వాడి నైతిక అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిగా చూడాలని ఆమె అన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి  అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం 5 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం రాష్ట్రం లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇచ్చి మా ప్రభుత్వం ఆదుకుంటుంది అని సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మిల్కురి ఐలయ్య,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిలి రవి, ఎంపీటీసీ జంగిలి శ్రీలత,గ్రామ కమిటీ అధ్యక్షులు చేన్నోజు శ్రీనివాస్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు కొంపెల్లి రాజీ రెడ్డి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు రాజీ రెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షులు బుస సాంబయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జకీర్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్ల కోటి,మాజీ సర్పంచ్ రహిముద్దిన్ తో పాటు జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related posts

కొనసాగుతున్న జూదం: పట్టించుకోని స్థానిక పోలీసు యంత్రాంగం

Satyam NEWS

డిసెంబ‌రు 10న అరుణ‌గిరిపై మ‌హాదీపోత్స‌వం

Satyam NEWS

రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment