38.2 C
Hyderabad
April 29, 2024 14: 53 PM
Slider నెల్లూరు

“అందరి గెలుపునకు ఎంపీ ఆదాల రొట్టె”

#MP Adala Prabhakar Reddy

జిల్లాలోని పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపునకు బారాషాహిద్ దర్గాలో రొట్టెను పట్టుకున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బారాషాహీద్ దర్గాలో గంధోత్సవం తర్వాత పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రి కాకాని తో కలిసి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బారాషాహిద్ దర్గాను సోమవారం సందర్శించారు. బారాషాహిదుల దర్శనానంతరం, దర్గాలోని ఏర్పాట్లను పరిశీలించారు. స్వర్ణాల చెరువు తీరానికి వెళ్లి రొట్టెను పట్టుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కాకాని సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని రొట్టెను పడితే, తాను మళ్లీ అందరు ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలని రొట్టెను పట్టినట్లు తెలిపారు. పవిత్రమైన పారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగను అత్యద్భుతంగా నిర్వహించామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, కమిషనర్ వికాస్ మర్మత్, జెసి కూర్మనాధ్, దర్గా కమిటీ సంయుక్తంగా కృషి చేశాయని ప్రశంసించారు.

ఆదివారం గందోత్సవాన్ని పురస్కరించుకొని లక్షలాదిమంది దర్గాకు తరలి వచ్చినప్పటికీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు, లోటుపాట్లు దొర్లకుండా చూశారని కొనియాడారు. ఇంత చక్కగా పనిచేసిన వీరందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు జరిగాయని, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తన సూచనలను అందజేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, దర్గా కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ యాదవ్, జాయింట్ కలెక్టర్ కూర్మనాద్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా, మైనార్టీ నేతలు రియాజ్, అబుబకర్, ఇంతియాజ్,హాజీబాబా, అల్లాబక్షు, ఇక్బాల్, మునవర్, ఖిల్జి సలీం, కార్పొరేటర్లు మొబీనా, మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, ప్రశాంతి,వైసీపీ నేతలు
స్వర్ణ వెంకయ్య, సుధాకర్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, గునపాటి రమేష్ రెడ్డి, చంద్రమౌళి, సురేష్ రెడ్డి, టీవీఎస్ కమల్, నరసింహారావు, తలారి విఠల్ తదితరులు హాజరయ్యారు.

Related posts

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు అభినందల మాల

Satyam NEWS

సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా

Satyam NEWS

ఆర్టీసీ విలీనం కుదిరేపని కాదని మరో మారు వెల్లడి

Satyam NEWS

Leave a Comment