అప్పటి వరకూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఆ కుటుంబంతో ఒక్క సారిగా విధి ఆడుకున్నది. నేనున్నాను అంటూ గుర్తు చేసింది. అదృష్టవశాత్తూ అందరూ గాయాలతో బయటపడ్డారు కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ మంథని రామకృష్ణ కుటుంబంతో మంచిర్యాల నుండి హైదరాబాదు వెళ్తుండగా సోమవారం నాడు కాట్నపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు మొదట డివైడర్ ను ఢీ కొంది. ఢీకొని అనంతరం కల్వర్టులో పడింది. ఒక్క ఉదుటన కారు కల్వ ర్టర్ లో పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.