ఎస్ బ్యాంకు మనీ లాండరింగ్ కుంభకోణానికి సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్ ఫోర్సు మెంటు డైరెక్టరేట్ ఆయనకు సమన్లు జారీ చేసింది. అంబానీ గ్రూప్ కంపెనీలు ఎస్ బ్యాంకు నుంచి దాదాపు రూ. 12,800 కోట్ల రుణాలను తీసుకున్నట్టు ఎన్ ఫోర్సుమెంటు డైరక్టరేట్ పేర్కొంది.
అంబానీ గ్రూప్ కంపెనీలే కాకుండా ఎస్ బ్యాంకు నుంచి ఎస్సెల్, ILFS, DHFL, వోడాఫోన్ లు కూడా పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలకు చెందిన వారిని ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ విచారించాలని భావిస్తున్నందున సమన్లు జారీ చేస్తున్నది. అంబానీ మీద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ ఏ) కింద నమోదు చేస్తామని ఇన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ అధికారులు చెప్పారు.
ఎస్ బ్యాంకు చైర్మన్ రాణా కపూర్ ప్రస్తుతం ఎన్ ఫోర్సుమెంటు డైరక్టరేట్ కస్టడీలో ఉన్నాడు. ఈ నెల మొదట్లో అతడిని ఇడీ అరెస్టు చేసింది. బ్యాంకు ద్వారా రూ. 4,300 కోట్ల రుణాలు ఇవ్వడం, అవి నిరర్ధక ఆస్తులుగా మారిపోవడంతో ఎస్ బ్యాంకు దివాలా తీసిన విషయం తెలిసిందే.