27.7 C
Hyderabad
May 4, 2024 09: 37 AM
Slider నిజామాబాద్

కేసిఆర్ జనరంజక పాలనకు యావత్ దేశం ఫిదా

#balkonda

కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం బట్టాపుర్ గ్రామానికి చెందిన రాక్ స్టార్ యూత్ సభ్యులు 30 మంది,బంజారా యూత్ సభ్యులు 20 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గురువారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాల అభివృద్ది చేశానని అన్నారు. అభివృద్ది వైపే ఉంటామని యువత నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. యువత భాగస్వామ్యం అబివృద్దికి మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది,వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసిఆర్ గులాబీ జెండానే అని మంత్రి స్పష్టం చేశారు. కేసిఆర్ సంక్షేమ పథకాలకు,జనరంజక పాలన చూసి యావత్ దేశం ఫిదా అవుతుందని,ఎట్లా సాధ్యమని వివిధ రాష్ట్రాల నేతలు నోరెళ్ళ పెడుతున్నారని అన్నారు. ఎవ్వరికీ సాధ్యం కానివి సుసాధ్యం చేసిన ఘనత కేసిఆర్ దే అన్నారు. దేశాన్ని ఆలోచింప చేస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని,తెలంగాణ ప్రజల సంక్షేమమే కేసిఆర్ అసలు అజెండా అని తెలిపారు. తెలంగాణ ప్రజలే తన ఆశా…శ్వాస గా కేసిఆర్ భావిస్తారని కేసిఆర్ లాగా తెలంగాణ ప్రజలను మరెవ్వరూ ప్రేమించలేరని తేల్చి చెప్పారు. తన ప్రజల కోసం ఎందాకైనా సరే అనే తెగింపు ఉన్న గొప్ప నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్,బీజేపీ లది ఓట్ల ఆరాటమైతే కేసిఆర్ ది తెలంగాణ ప్రజల బతుకుదెరువు,అభివృద్ది ఆరాటమన్నారు. కాంగ్రెస్ ప్రజలను గోస పెట్టే పార్టీ అయితే బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీ అని దుయ్యబట్టారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. యువకులు ఎక్కడిక్కడ కథానాయకులై కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,కేసిఆర్ చేసిన మంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నటికైనా కేసిఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల మరోమారు పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం,మండల పార్టీ నాయకులు,గ్రామ సర్పంచ్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జనసేన అధినేత ఇంటి వద్ద రెక్కీపై ఆందోళన

Bhavani

జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కేసీఆర్ ఆరోపణలు

Satyam NEWS

అనుమతులులేని క్లినిక్‌, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment