28.7 C
Hyderabad
May 6, 2024 08: 32 AM
Slider రంగారెడ్డి

ఎస్ సి మహిళలు  ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

#scwomen

ఎస్ సి మహిళల  స్వయం ఉపాది కోరకు ప్రభుత్వం  తొంభై రోజుల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ, మగ్గం వర్క్,బ్యూటిషియన్ వర్క్, కుట్లు అల్లికలు, తదితర వాటిని ఉచితంగా నెర్పిస్తారని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ స్పష్టం చేశారు. ఆదివారం హబ్సిగూడ డివిజన్ లోని హరిజన బస్తీ  ప్రభుత్వ పాఠశాలలో యస్ సి మహిళల  స్వయం ఉపాది కోరకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణ శిబిరం  సన్నాహక సమావేశానీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్  మాట్లాడుతూ హరిజన బస్తీ లోనీ మహిళలు స్వయం ఉపాధి కొరకు  శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేసామని తెలిపారు . ఈ శిక్షణ శిబిరం ద్వారా మహిళలకు ఉచితంగా తొంభై రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ, మగ్గం వర్క్,బ్యూటిషియన్ వర్క్, కుట్లు అల్లికలు, తదితర వాటిని ఉచితంగా నెర్పిస్తారని తెలిపారు, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లు ఇస్తారని, వారు స్వంతంగా యూనిట్లు ఏర్పాటు కోరకు ఆర్థిక సాయం చెస్తారని తెలిపారు, ఒక క్యాంపులో సుమారు 35 మంది మహిళలు ఒక బృందంగా ఎర్పడి శిక్షణ తీసుకోవాలని కోరారు. మహిళా సంఘాల నాయకురాలు మోదుగుల సుకన్య కార్పొరేటర్ చేతన హరీష్ ని సన్మానించారు  

ఈ కార్యక్రమంలో  పోన్నాడ లక్ష్మీ, గ్యార అనిత ,భాగ్య సంగీత ,సువర్ణ ,తిరుమల పరమేశ్వరి,  బిజెపి నాయకులు బోమ్మగొని రఘపతి గౌడ్, గ్యార రవీందర్, కట్ట భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

డాక్టర్ సుధాకర్ ఈ సమాజాన్ని క్షమించు

Satyam NEWS

స్కూలు బస్సు బోల్తా

Murali Krishna

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Murali Krishna

Leave a Comment