39.2 C
Hyderabad
May 3, 2024 14: 18 PM
Slider నిజామాబాద్

ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్న వ్యక్తి నాపై ఆరోపణలు చేయడమా..?

#shabirali

బీజేపీ నేత వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ ఫైర్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అమ్ముకొని సింగల్ గా వెళ్లి నామినేషన్ విత్ డ్రా చేసుకున్న వ్యక్తి  మాస్టర్ ప్లాన్ విషయంలో నాపై ఆరోపణలు చేయడమా అని బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డిపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై బుధవారం తన నివాసంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ ఆసక్తికర కామెంట్లు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో రైతులతో సహా నేను కూడా ఒక బాధితున్నేనన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.

మాస్టర్ ప్లాన్ వస్తున్న ఏరియాలో తనకు 13.14 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనన్నారు. 15 ఏళ్ల క్రితమే ఆ భూమి కొనుగోలు చేసి ఐదేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు. ఆ భూమిని అమ్మలేదని స్పష్టం చేశారు. అమ్మకానికి ప్రపోజల్ వచ్చినా అమ్మలేదని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డుకు తన భూమి చాలా దూరం ఉంటుందన్న ఆయన మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుగా స్పందించి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ద్వార తాను మాత్రమేనని గుర్తుచేశారు.

మాస్టర్ ప్లాన్ ను చూపిస్తున్న షబ్బీర్ అలీ

ఇబ్రహీంపట్నంలో ఇలాగే భూమి సేకరించి భూములు చదును చేసి ఒక్కొక్క రైతుకు 5 లక్షలిచ్చి 12 కోట్లకు అమ్ముకున్నారని, కోకాపేటలో ఎకరం 60 కోట్లకు అమ్ముకున్నారని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ లో భూములు పోతున్న నిర్వాసితులు తనను కలిసి వినతి పత్రం అందించారని, దీనిపై అరవింద్  కుమార్ ఐఏఎస్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఆ మాస్టర్ ప్లాన్ అమలు కాకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు.

తన పర్సనల్ సెక్రెటరీ ద్వారా వినతిపత్రం కూడా పంపించానని, దాంతో అరవింద్ కుమార్ స్పందిస్తూ  రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను తప్పకుండా ఆపేస్తామని తెలిపారన్నారు. గురువారం సాయంత్రం లోపు మాస్టర్ ప్లాన్ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. బీజేపీ నేత వెంకట రమణారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఆయనది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అని, కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు.

రమణారెడ్డికి తన చేతుల మీదుగా నాలుగు సార్లు బి ఫార్మ్ ఇచ్చానని, ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అంటే పార్టీ అధిష్టానం బి ఫారం ఇవ్వకుంటే అధిష్టానాన్ని ఒప్పించి ఎమ్మెల్సీగా బి ఫార్మ్ ఇప్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగులో ప్రాణం పోయినా తప్పు చేయనని చెప్పి నామినేషన్ రోజు సింగిల్ గా వెళ్లి విత్ డ్రా చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. నమ్మకంతో పార్టీ టికెట్ ఇస్తే అమ్ముడుపోయాడని ఆరోపించారు.

కోట్లకు అమ్ముడు పోయాడని మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు. ఎందుకు విత్ డ్రా అయ్యవని అడిగితే ఈటల రాజేందర్ ఫోన్ తో కేసీఆర్ ఫోన్ చేసి బెదిరించారని చెప్పాడన్నారు. షబ్బీర్ ఆలీకి 2 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నా అని ప్రచారం చేశారని, మీడియా సమావేశంలో జర్నలిస్టులు ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని అడిగితే మధ్యలోనే వెళ్ళిపోయాడన్నారు. మళ్ళీ కొన్ని రోజులకు వచ్చి కాంగ్రెస్ లో చేరతానంటే క్యారెక్టర్ బాగాలేదని నేను చేర్చుకోనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు తనకు 100 ఎకరాలు ఉందని బద్నాం చేస్తున్నారన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించలేదన్నారు. మొన్నటిదాకా మూడు నెలల పాటు అబ్దుల్లా నగర్ శివారుపై మాట్లాడాడని, ఇప్పుడు అబ్దుల్లా నగర్ ఏమైంది..? సమస్య పరిష్కారం అయిందా..? అక్కడి రైతులకు న్యాయం జరిగిందా..?లేక నీకు న్యాయం జరిగిందా అని రమణారెడ్డిని ప్రశ్నించారు. అబ్దుల్లా నగర్ భూములపై ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ లో తన ఇల్లు కూడా పోతుందని, గతంలో 40 ఫీట్లు ఉన్న రోడ్డు ఇప్పుడు 80 ఫీట్లు చేశారు.. అందులో నా ఇల్లు 20 ఫీట్లు పోతుందన్నారు.

అయినా రోడ్డు వెడల్పు అయితే మంచిదే కదా అన్నారు. అధికారంలో ఉంటే బురద జల్లే ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుందని, 15 ఏళ్లుగా నేను అధికారంలో లేనని, తనకు మాస్టర్ ప్లాన్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటానని,  మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ పట్టణానికి దూరంగా చేయాలని కోరానన్నారు. 100 ఫీట్ల రోడ్డు కాకుండా 60 ఫీట్లు పెట్టాలని సూచించడం జరిగిందన్నారు.

తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని, రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి.. ఇలాంటివి కాదని హితవు పలికారు. ఇన్నేళ్లు రమణారెడ్డి తండ్రి రాజిరెడ్డి తన గురువు అనే కారణంతో మాట్లాడలేదని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని, ప్రజలు గమనించాలని కోరారు.

Related posts

తాగి న్యూసెన్స్ సృష్టిస్తే పోలీసులు తీట తీస్తారు

Satyam NEWS

కోడెల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

Satyam NEWS

ఎన్టీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో కువైట్ లో సీబీయన్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment