ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కోడెల శివప్రసాదరావు కాల్ డేటా పరిశీలిస్తే ఆయనతో ఎవరెవరు మాట్టాడారో తెలిస్తే కేసు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని భావించిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. కోడెల శివప్రసాదరావు ఇంటి నుంచి ఆయన ఫోన్ మాయం అయింది. ఆయన వ్యక్తిగత ఫోన్ మిస్సింగ్ కావడం పై పోలీసులు విచారణ చేస్తున్నారు. కోడెల చివరి సారిగా దాదాపు 24 నిమిషాల పాటు ఒకరితో ఫోన్ లో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి సెల్ ఫోన్ కోసం వెతకగా అది మిస్సింగ్ అయినట్లు వెల్లడి అయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు కోడెల సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. కోడెల సెల్ ఫోన్ మిస్ కావడంతో కోడెల ఆత్మహత్య కోణంలో మరో మలుపు వచ్చినట్లయింది.
previous post