Slider సినిమా

బౌన్సర్ హిట్ :బంతి బ‌లంగా తాక‌డంతో షాహిద్ క‌పూర్ త‌ల‌కి 13 కుట్లు

shahid kapur

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ ఇటీవ‌ల అర్జున్ రెడ్డి రీమేక్‌(క‌బీర్ సింగ్‌)తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాని న‌టించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ ఛండీఘ‌ర్‌లో జ‌రుగుతుంది. అయితే క్రికెట్‌కి సంబంధించి ప‌లు షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మయంలో ఓ బౌన్స‌ర్ షాహిద్ త‌ల‌కి బ‌లంగా తాక‌డంతో 13కుట్లు ప‌డ్డాయ‌ని తెలుస్తుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే షాహిద్‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య‌ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. నాలుగైదు రోజుల విశ్రాంతి త‌ర్వాత షాహిద్ తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్న‌ట్టు తెలుస్తుంది. జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ , జాకీ ష్రాఫ్‌, పాంకే త్రిపాఠి, పంక‌జ్ క‌పూర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ హిందీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Related posts

మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా టెట్ పరీక్ష

mamatha

నిలువు దోపిడి చేస్తున్న స్మార్ట్ పాయింట్స్

Satyam NEWS

త్వరలో తల్లికి వందనం, రైతు భరోసా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!