35.2 C
Hyderabad
May 1, 2024 02: 22 AM
Slider ప్రత్యేకం

విత్ ఇన్ సెకండ్స్:కొచ్చిలో19 అంతస్తుల భవనం మటాష్

kochi

తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించినందుకు సరస్సును ఆనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలు ఉల్లంఘించి కోచిలోని మారడు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన రెండు భారీ భవనాలను శనివారం ఉదయం నేలమట్టం చేశారు. ఇందుకోసం వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. మారడు మున్సిపాలిటీలోని హెచ్‌20 హోలీ ఫేత్‌, ఆల్ఫా అపార్ట్‌మెంట్‌లను  నేలమట్టం చేస్తున్నారు. 

తొలుత హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌మెంట్‌ను 11.18 నిమిషాలను కూల్చారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే భవనం నేలమట్టమైంది. మరికాసేపట్లో ఆల్ఫా కాంప్లెక్స్‌ను కూల్చనున్నారు. కూల్చివేతకు ముందు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పొరుగున్న ఉన్న భవనాలను ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వీటిని నేలమట్టం చేశారు. అంతేగాక.. కూల్చివేత సమయంలో ప్రజలెవరూ అటు పక్కకు రాకుండా ఆంక్షలు విధించారు. 19 అంతస్తుల హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌మెంట్‌లో 91 అపార్ట్‌మెంట్‌లు ఉన్నారు. 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు ఉపయోగించి దీన్ని నేలమట్టం చేశారు. 17 అంతస్తుల ఆల్ఫా కాంప్లెక్స్‌లో 67 అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. 

తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించినందుకు సరస్సును ఆనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో కేరళ ప్రభుత్వం చర్యలకు ఉపక్రటించింది. ఇందులో భాగంగా ఈ రోజు రెండు భవనాలను నేలమట్టం చేశారు. ఆదివారం మరో రెండు భవనాలను కూల్చనున్నారు. 

Related posts

ఎలారమింగ్: దేశవ్యాప్తంగా మూతపడుతున్న పత్రికలు

Satyam NEWS

తునిలో మంత్రి ధర్మాన మునిసిపల్ ఎన్నికల ప్రచారం

Satyam NEWS

31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment