Slider ప్రత్యేకం

తెలంగాణలో పోటీ నుంచి వైదొలగిన వైఎస్ షర్మిలారెడ్డి

#yssharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణలో చాప చుట్టేశారు. తెలంగాణలో అన్ని సీట్లు పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె పూర్తిగా విఫలం అయ్యారు. చివరకు తాను మాత్రమే పోటీ చేస్తానని ఆమె చెప్పారు. దాని కోసం ఖమ్మం జిల్లా పాలేరును ఆమె ఎంపిక చేసుకున్నారు. అయితే చివరకు పాలేరు నుంచి కూడా ఆమె విరమించుకున్నారు. దాంతో షర్మిలారెడ్డి తెలంగాణ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లు అయింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు తాను తీసుకుంటున్న నిర్ణయం  ప్రజల కోసమేనని ఆమె అన్నారు. కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉంది. కేసీఆర్ ఓడిపోయేంత చాన్స్ ఉంది. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దని.. మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని అడగడం జరిగింది. ఓటు బ్యాంకు చీలకుండా ఉంటే కాంగ్రెస్ కు ఒక చాన్స్ ఉందన్నారు.

మీరు దానికి అడ్డు పడవద్దని అడిగారు వైయస్ఆర్ తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,  వైయస్ఆర్ బిడ్డే కాంగ్రెస్ ఓడించడం సమంజసం కాదని మమ్మల్ని అడగడం జరిగింది. వైయస్ఆర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇన్నేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అటు కర్నాటకలో ఫలితాలు చూపాయి. ఇటు తెలంగాణలోనూ గెలిచే అవకాశం ఉంది. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నన్ను ఢిల్లీకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ. తెలంగాణ ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటున్నాం అని ఆమె తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్షన్ లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదు. 10 రోజుల ముందు పోటీ చేస్తామని చెప్పాం. కానీ సమయం గడిచే కొద్ది కొన్ని నిర్ణయాలు బలపడుతుంటాయి అని ఆమె తెలిపారు. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ ఎన్నో అక్రమాలు చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అని అన్నారు.

Related posts

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

Satyam NEWS

జగన్ పై ప్రభావం చూపిన రామ్ మాధవ్ ప్రకటన

Satyam NEWS

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి

Bhavani

Leave a Comment