39.2 C
Hyderabad
April 30, 2024 21: 12 PM
Slider

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి

#Modi

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్– 3 ని విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 14న చంద్రయాన్‌‌ – 3 ప్రయోగం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.

అంతరిక్ష రంగంలో జులై 14, 2023 చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి చంద్రయాన్ 3 ప్రయాణం మొదలు కానుంది. కోట్ల మంది ప్రజల ఆశల్ని ఈ రాకెట్ నింగిలోకి తీసుకువెళ్తుంది.’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు.

భవిష్యత్తులో చంద్రుడిని ఆవాసయోగ్యంగా మార్చుకోవచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ధవన్స్పేస్సెంటర్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగానికి రెడీ అయింది.

అంతా సవ్యంగా జరిగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గణ్, అనుపమ్ ఖేర్ తదితరులు శాస్ర్తవేత్తల బృందానికి గుడ్లక్ చెప్పారు.

Related posts

గురజాల సిమెంటు ఫ్యాక్టరీలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించాలి

Satyam NEWS

హుమాయూన్ నగర్ లో కంటేన్ మెంట్ జోన్

Satyam NEWS

సమంత డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు…..

Satyam NEWS

Leave a Comment