మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయం మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవ వద్దని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండే షిర్డీ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ప్రకటించారు. బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు.