29.7 C
Hyderabad
April 29, 2024 10: 55 AM
Slider తూర్పుగోదావరి

గోదావరికి వరద సూచికతో అధికార యంత్రాంగం అప్రమత్తం

#polavaram

గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చెయ్యడం జరిగిందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం అధికార  యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని జిల్లా స్థాయి, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి 24 గంటలు షిఫ్ట్ లలో సిబ్బందిని నియమించామన్నారు.

కలెక్టరేట్ పరిధిలో కంట్రోల్ రూం

8977935609 నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా షిఫ్ట్ ల వారీగా సిబ్బంది నియమించినట్లు తెలిపారు. జూలై 8 వ తేదీన నుంచి జూలై 11 వ తేదీ వరకు షిఫ్ట్ లలో కలెక్టరేట్ సిబ్బంది అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని అధికారులతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో  కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు  088132 31488 ల్యాండ్ లైన్ నంబర్ల ను  అందుబాటులో ఉంచామని , 24 x 7 సిబ్బంది షిఫ్ట్ లలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.

Related posts

ఖాజపాషాను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

Satyam NEWS

పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్న విజయనగరం కొత్త క‌లెక్ట‌ర్

Satyam NEWS

అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి

Satyam NEWS

Leave a Comment