27.7 C
Hyderabad
May 4, 2024 09: 11 AM
Slider కరీంనగర్

సెటిల్మెంట్:శివ శవం తో కుటుంబ సభ్యుల ఆందోళన

shiva murder settled with 10 lakhs funarals complited

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం జరిగిన కత్తిపోట్ల కు గురై చనిపోయిన నూగూరి శివ (30)శవాన్ని పోస్ట్ మార్టం అనంతరం పోలీస్ లు వేములవాడకు తీసుకు రాగా కుటుంబ సభ్యులు శివని చంపినా ముద్రకోలా వెంకటేశం ఇంటిముందు అంత్యక్రియలు నిర్వాహిస్తామని శవం తో ఆందోళనకు సిద్ధపడ్డారు.ఇది గ్రహించిన పోలీస్ లు వేములవాడ సి ఐ లు నవీన్, శ్రీధర్ ల నేతృత్వం లో శవాన్ని నేరుగా మహాలష్మి గుడి వద్ద గల స్మశాన వాటికకు శవాన్ని తీసుకు వచ్చి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో మోహరించారు.

శివ భార్య లత తన ఇద్దరు పిల్లలతో తానూ ఆనాదగా మారానని రోదించడం ,తమకు న్యాయం జరగాలని వేడుకుంటం తో పోలీసులు కుడా సామరస్య ధోరణితో వారిని బేరసారాలకు వదిలి వెసారు.వెంకటేశం ఇంటి ముందు నుండి వాగు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు రూ 50 లక్షలు ఇవ్వాలని లేదా తమకు ఆధారం చూపాలని కోరుతూ శవానికి అంత్య క్రియలు పోలీస్ లనే చేసుకొమ్మని చెబుతూ వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.చివరికి పోలీస్ ల జోక్యం తో రూ.10 లక్షలు చెల్లించే విధంగా కులసంగం నేతలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం తరుపున పోలీస్ లు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే విధం గా ఒప్పందం కుదుర్చుకుని శివ అంత్య క్రియలు పూర్తి చేశారు.

చర్చల సందర్భం గా అటు పోలీసులను ఇటు పాత్రికేయులను శివ కుటుంబ సభ్యులు నానా భూతులు తిట్టడం గమనార్హం.కాగా ఇటు శివ కుటుంబ సబ్యులకు అటు పోలీస్ లకు వెంకటేశం నుండి బారి ఎత్తున డబ్బులు ముట్టుతున్నాయని విమర్శలు వెలువడుతున్నాయి.కాగా ఏ విమర్శలు ఎలా ఉన్న శివ అనే వాడుఎలాంటి వాడైనా అయన ను ప్రేమించి పెళ్లి చేసుకుని వైధవ్యం పొందిన భార్య లత ,తండ్రి లేని ఇద్దరు పిల్లలకు ఇంత ఆసరా దొరికిందని ప్రజలు అనుకుంటున్నారు.

Related posts

6 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

Sub Editor 2

దాతృత్వాన్ని చాటుకున్న సిరిపురం విశ్వనాథం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS

Leave a Comment