37.2 C
Hyderabad
May 6, 2024 19: 31 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

kollapur sivajee

భజరంగదళ్ కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యం లో ఛత్రపతి శివాజీ 390వ జయంతి ఘనంగా జరిగింది. స్థానిక శివాజీ చౌరస్తాలో చత్రపతి శివాజీ చిత్ర పటానికి పులమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు అరటిపండ్లను పంపిణీ చేశారు.

భజరంగ్ దళ్ కు చెందిన పురందర్, బిజెపి నాయకులు సుధాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు గర్వం గా నేను హిందువుని అని చెప్పుకోగలుగుతున్నామంటే కారణం ఛత్రపతి శివాజీ అని అన్నారు.

భారత మాత ఒడిలో రక్త తర్పణ చేసిన లక్షలాది మంది శౌర్య హిందు వీరుల త్యాగ ఫలం ఇదని వారన్నారు. అలాంటి వీరుల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒకరు…ఆయన పరాక్రమ త్యాగ నిరతిని, హిందు ధర్మ పరిరక్షణ యజ్ఞాన్ని తిరిగి ఆవాహన చేసుకుని హిందు ధర్మ పరిరక్షణ కార్య కంకణం బద్ధులం కావాల్సిన  సమయం ఆసన్నం అయిందని వారన్నారు.

హైందవ సంఘటన ప్రదర్శన వీర గడ్డ, పోరు గడ్డ, హిందూస్థాన్ కాషాయ జెండా లో చూపించాల్సిన అవసరం ఏంతో ఉందని వారు తెలిపారు. హైందవ జాతి అస్థిత్వాన్ని కాపాడుకుందాం. జై భవాని జై వీర శివాజీ అంటు పెద్ద సంఖ్యలో యువకులు నినాదాలు చేశారు. అనంతరం వైభవంగా శోభ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెంటే శివ కృష్ణ, సరాంగి అమర్ నాథ్, భానుప్రకాశ్, సుంకరి శివ, కలర్ మహేష్, పులి భరత్, బండల రమేష్, ఇట్టి కేల రాజు, కాడం రఘు, ఆశోక్, శివ భజరంగదళ్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

19న 5కె రన్

Bhavani

శబరిమలలో పోటెత్తిన భక్తులు

Satyam NEWS

అక్రమ రేషన్ బియ్యం పట్టిచ్చినా పట్టించుకోని అధికారులు

Satyam NEWS

Leave a Comment