28.7 C
Hyderabad
April 26, 2024 10: 15 AM
Slider కడప

బిల్లు లు చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం

bhatyala 19

ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5000 వేల కోట్లు నిధులు రిలీజ్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మళ్లించిందని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్  బత్యాల చంగల్ రాయుడు ఆరోపించారు. దాంతో పని చేసినవారికి పేమెంట్స్ రాక  అప్పులు తెచ్చి వడ్డీలు పెరిగి నాన అగచాట్లు పడుతున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు రోజుకు 2500 – 3000కిలోమీటర్ల మేర రోడ్లను వేశారని, గత రెండు సంవత్సరాలుగా సిమెంట్ రోడ్లు, గోకులాలు, మినీ గోకులాలు, చెత్త నుండి సంపద(SWPC), స్కూళ్లకు, స్మశానవాటికలకు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భూములలో మొక్కలు పెంచటం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటటం వంటి పనులు పూర్తి చేశామని ఆయన అన్నారు. అలాగే పనిచేసిన దానికి కేంద్రం నుంచి నిధులు వచ్చిన తర్వాత మూడు రోజుల లోపల ఇవ్వాలని, ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 12% ఇంట్రెస్ట్ పెనాల్టీ వేయబడుతుందని ఆయన అన్నారు.

ఇదంతా ప్రభుత్వ ఉత్తర్వులలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ వారికి ప్రభుత్వం న్యాయం చేయలేని పరిస్థితుల్లో తాము చట్టం,ధర్మం, న్యాయ సమానమైన కోర్టును ఆశ్రయిస్తామని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, పట్టణ అధ్యక్షుడు సంజీవరావ్, మండల అధ్యక్షుడు సమ్మెట శివప్రసాద్, జడ్పీటీసీ శివరామరాజు, బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, రాంచంద్రయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు. అంతే కాకుండా దరిమిశెట్టి వెంకటరమణ, మన్నూరు రాజ, కరిముల్లా, అభూబకార్, కొండా శ్రీను, మందా శ్రీనివాసులు, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం, సత్యనరసింహ, రెడ్డయ్య నాయుడు, లక్ష్మిరెడ్డి, శంకర ఆచార్యులు, రాంనగర్ నరసింహ, హరీష్, పీరు, ఓబిలి మల్లికార్జున రెడ్డి, సుబ్బు, యనాది, శివయ్య నాయుడు, కస్తూరి సుధాకర్, శివయ్య, నరసింహ, బాలసుబ్రహ్మణ్యం, చంద్రమౌళి ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాన్సువాడ అభివృద్ధి పనులపై స్పీకర్ సమీక్ష

Satyam NEWS

Revboost Male Enhancement

Bhavani

ఏడు గంటల పాటు కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష…!

Satyam NEWS

Leave a Comment